లవ్, ఎమోషన్, డ్రామా వంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు చక్కటి సోషల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్
- క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందించిన తాజా చిత్రం ‘దండోరా’. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ సినిమాను మురళీకాంత్ తెరకెక్కించారు. ఈ చిత్రం డిసెంబర్ 25న భారీ ఎత్తున విడుదల కాబోతోంది.
▶️https://youtu.be/5P7pEqSTojo
వైవిధ్యమై ప్రమోషనల్ స్ట్రాటజీతో ‘దండోరా’ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా రిలీజ్‌కు ముందే బిజినెస్‌ను పూర్తి చేసుకోవటం విశేషం. చిత్రాన్ని నైజాంలో మైత్రీ మూవీస్ సంస్థ రిలీజ్ చేస్తుంటే.. ఆంధ్ర, సీడెడ్, కర్ణాటక ఏరియాల్లో ప్రైమ్ షో రిలీజ్ చేస్తోంది. ఓవర్సీస్‌లో 200కు పైగా థియేటర్స్‌లో సినిమాను అథర్వణ భద్రకాళి పిక్చర్స్ గ్రాండ్ రిలీజ్ చేస్తోంది. ఓవర్సీస్‌లో అయితే డిసెంబర్ 23నే ప్రీమియర్స్ పడుతున్నాయి.
మంచి అంచనాలతో క్రిస్మస్ సందర్బంగా విడుదలవుతోన్న ‘దండోరా’ సినిమా నుంచి శుక్రవారం రోజున మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు. సాంకేతికంగా మనిషి రోజు రోజుకీ ఎంతో ఎదుగుతున్నాడు. మారుమూల ప్రాంతాల్లోని ప్రజలు మంచి చదువులు చదువుకుని అమెరికాకు వెళ్తున్నారు. ఇంత డెవలప్‌మెంట్ అవుతున్నా.. సమాజాన్ని పట్టి పీడుస్తోన్న అంతర్గత సమస్యల్లో ప్రధానమైనది కులం. అలాంటి ఓ సెన్సిటివ్ విషయాన్ని కమర్షియల్ పంథాలో ఫన్నీగా ఆవిష్కరించారు డైరెక్టర్ మురళీకాంత్. ఇప్పటి వరకు విడుదలైన సాంగ్స్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచాయి.
తాజాగా విడుదలైన ‘దండోరా’ ట్రైలర్‌ను మరింత పెంచాయి. ట్రైలర్‌ను గమనిస్తే.. ఊరి బయట కొంత మంది శవాన్ని మోసుకెళ్తుంటారు. ఇంత దూరం శవాన్ని ఎందుకు మోసుకు రావాలని వారితో పాటు వచ్చే చిన్న పిల్లాడు అడుగుతాడు. దానికి వాళ్లు..
‘మన చావు పుట్టకులన్నీ ఆ ఊరి బయట రాసిండ్రా ఆ దేవుడు..’
‘విష్ణుగాడొచ్చి కాళ్లు పట్టుకున్నా పని కాదని సర్పంచ్ సాబ్ చెబుతున్నాడా అని నందుతో మురళీధర్ పాత్ర చెప్పగానే.. నువ్వు ఉన్నోడివి ఉండకుండా ఆ సర్పంచ్‌గానికి ఎందుకు చెప్పినావ్..వాడేమన్నా పెద్ద లాడ్డా’ అని నందు చెప్పటం
‘ఒటేసినావ్‌రా అని’ నవదీప్ తన పక్క నుంచే వాడిని అడిగితే ‘ఎంత పెద్ద మాటన్నావ్ సర్పంచ్ నీ గుర్తుకే గుద్దినా’ అని వాడంటాడు. దానికి ‘ఓటుకి గుద్దినావో.. క్వార్టర్ గుద్ది ఇంట్లో పండినావో ఎవడు చూసిండవయ్యా’ అని నవదీప్ రియాక్ట్ కావటం..
‘ఒక ముద్దు పెట్టుకుంటానే అని రవికృష్ణ పాత్ర మణిక పాత్రను రిక్వెస్ట్ చేస్తే ఆమె ఏమో చెంప పగుల్తాది’ అని సీరియస్‌గా వార్నింగ్ ఇస్తది
‘సరే అయితే మా అయ్యతోని మాట్లాడి ముహూర్తం పెట్టించు..డైరెక్ట్‌గా మండపానికి వస్తాను ’ అని మణిక రవికృష్ణతో చెప్పే సీన్
‘నాన్న లేడు అని చెప్పి ఇప్పుడేమో బాధ్యతలు చూపిస్తున్నాడు’అటూ నందుని తన భార్య తిట్టే డైలాగ్
బిందుమాధవి నాగార్జున ఫొటోని ముద్దు పెట్టుకుంటూ ‘ఎట్లున్నాం మేమిద్దరం’ అంటూ శివాజీని అడగటం తనేమో చిరు కోపంగా చూడటం..
మరో సీన్లో అయితే శివాజీ సీరియస్‌గా ఒకర్ని కాలితో తన్ని.. ‘భయపడ్డావా.. పడాలి’ అంటూ వార్నింగ్ ఇవ్వటం
‘అయ్యిందేదో అయిపోయింది.. పెద్ద మనుషులు మీరే ఏదో ఒక పరిష్కారం చూపించండి’ అని మురళీధర్ పాత్ర రిక్వెస్ట్ చేయటం.. ‘పరిష్కారం లేదు.. బొంగులేదు..వెళ్లి ఆ చెట్టు కింద కాల్చుకోండి’ అంటూ నందుని చూసి కుల పెద్దలు చెప్పటం.. నవదీప్ సీరియస్ గా చూస్తుండటం
మరో సీన్‌లో మణిక రవికృష్ణతో మాట్లాడుతూ ‘అయినా చిరంజీవిలా బిల్డప్ ఇచ్చుకుంటూ తిరుగుతావ్‌కదా.. ఏదైనా చెయ్యొచ్చు కదా.. ’అని అంటుంది..
‘చావు నుంచైనా తప్పించుకోవచ్చు కానీ.. కులం నుంచి తప్పించుకోలేం రా’ అని మురళీధర్ పాత్ర నందుతో చెప్పటం
‘ఒకటి పెళ్లి దగ్గర లేకపోతే చావు దగ్గర .. ఈ రెండింటిలోనే కదా వీళ్ల ఆటలు సాగేవి’ అంటూ కుల పెద్దలను ఉద్దేశించి వచ్చే డైలాగ్
‘మన బతుకులు మారాలంటే మనకు కావాల్సిందొక్కటి.. చదువు..చదువు..’ అంటూ దేవీప్రసాద్ పాత్ర స్టేజ్ పై చెప్పటం..
ట్రైలర్ చివరలో నవదీప్ ‘కొట్రా డప్పు..’ అంటూ మాస్ స్టెప్స్ వేయటం.. అక్కడ వచ్చే టైటిల్ ట్రాక్
ఇలాంటి డైలాగ్స్ వింటూ ట్రైలర్ చూస్తుంటే సినిమాను ఎలాంటి డెప్త్‌తో తెరకెక్కించారనేది చెప్పేశారు మేకర్స్. ఊర్లో అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన నవదీప్ ప్రెసిడెంట్‌గా ఎన్నికవుతాడు. అక్కడి నుంచి ఊర్లో వచ్చే సమస్యలు, కుల పెద్దలకు, అతని వచ్చే ఘర్షణలు ఎలా ఉంటాయనే విషయాలను సన్నివేశాల రూపంలో చూపించారు.
శివాజీ పాత్ర, బిందు మాధవి పాత్ర మధ్య ప్రేమ, ఎమోషనల్ సన్నివేశాలను హృద్యంగా చూపించారు. అలాగే శివాజీ రోల్‌లోని సీరియస్ కోణాన్ని కూడా ఆవిష్కరించారు. నందు పాత్రతో పాటు రవికృష్ణ, మణిక పాత్రల మధ్య ప్రేమ సన్నివేశాలు ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఇలాంటి కుల వ్యవస్థ మీద ఆ గ్రామంలో ఎవరు దండోరా వేశారు.. చివరకు ఏం జరిగింది? అనే విషయాలు తెలియాలంటే డిసెంబర్ 25న రిలీజ్ అవుతోన్న సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్. దండోరా సినిమాలోని పాటలు టి సిరీస్ ద్వారా రిలీజ్ అవుతున్నాయి.
నటీనటులు:
శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు
సాంకేతిక వర్గం:
బ్యానర్: లౌక్య ఎంటర్‌టైన్మెంట్స్
నిర్మాత: రవీంద్ర బెనర్జీ ముప్పనేని
దర్శకత్వం: మురళీకాంత్
సినిమాటోగ్రఫీ: వెంకట్ ఆర్.శాఖమూరి
ఎడిటర్: సృజన అడుసుమిల్లి
సంగీతం: మార్క్ కె.రాబిన్
ఆర్ట్ డైరెక్టర్: క‌్రాంతి ప్రియం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎడ్వర్డ్ స్టెవెన్‌సన్ పెరెజి
కాస్ట్యూమ్ డిజైనర్: రేఖా బొగ్గారపు
లైన్ ప్రొడ్యూసర్: కొండారు వెంకటేష్
ఆడియో: T-సిరీస్
నైజాం డిస్ట్రిబ్యూషన్: మైత్రి మూవీస్
ఆంధ్ర – సీడెడ్ – కర్ణాటక: ప్రైమ్ షో
ఓవర్సీస్ రిలీజ్: అథర్వణ భద్రకాళి పిక్చర్స్
పి.ఆర్.ఒ: నాయుడు సురేంద్ర కుమార్- ఫణి కందుకూరి (బియాండ్ మీడియా)
మార్కెటింగ్: టికెట్ ఫ్యాక్టరీ

