టాలీవుడ్

ఎన్టీఆర్‌, కొరటాల శివ భారీ చిత్రం దేవర నార్త్ ఇండియన్‌ రైట్స్ సొంతం చేసుకున్నకరణ్‌జోహార్‌ ‘ధర్మ ప్రొడక్షన్స్’,అనిల్‌ తడానీ ‘ఏఏ ఫిల్మ్స్’

మాన్‌ ఆఫ్‌ మాసెస్‌ నటిస్తున్న భారీ బడ్జెట్‌ సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రపంచస్థాయిలో బజ్‌ క్రియేట్‌ చేస్తున్న సినిమా ఇది. బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీ ఖాన్‌ కీ రోల్‌ చేస్తున్నారు.

రెండు పార్టులుగా తెరకెక్కుతోంది దేవర. ఫస్ట్ పార్టు షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అక్టోబర్‌ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు, హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళంలో చిత్రాన్ని అత్యంత భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాకు ఇప్పుడు బాలీవుడ్‌ నుంచి అద్భుతమైన సపోర్ట్ లభించింది. బాలీవుడ్‌ మేజర్‌ ప్లేయర్స్ ఈ చిత్రంతో చేతులు కలుపుతున్నారు. ధర్మ ప్రొడక్షన్స్, ఏఏ ఫిల్స్ కలిసి ఈ సినిమాను ఉత్తరాదిన డిస్ట్రిబ్యూట్‌ చేయనున్నారు.

దేవర నార్త్ థియేట్రికల్‌ రైట్స్ ని కరణ్‌ జోహార్‌, అనిల్‌ తండానీ సొంతం చేసుకున్నారు. అత్యంత భారీ మొత్తం చెల్లించి ఈ మాగ్నమ్‌ ఆపస్‌ని దక్కించుకున్నారు వారిద్దరూ. ఎన్టీఆర్‌, కొరటాల శివతో కరణ్‌ జోహార్‌, అనిల్‌ తండానీ, అపూర్వ మెహతా ఉన్న పిక్‌ని షేర్‌ చేసుకున్నారు. ఎన్టీఆర్‌కి ఉత్తరాదిన ఉన్న స్టార్‌డమ్‌కి, కరణ్‌ జోహార్‌, అనిల్‌ తండానీ పేర్లు యాడ్‌ కావడంతో వేరే లెవల్‌ బజ్‌ క్రియేటైంది.

ఉత్తరాది మార్కెట్‌ నుంచి అనూహ్యమైన కలెక్షన్లు గ్యారంటీ అనే మాట  గట్టిగా వినిపిస్తోంది. ఇండియన్‌ సినిమాలో మైల్‌స్టోన్‌ మార్క్ దేవర క్రియేట్‌ చేస్తుందనే నమ్మకం మరోసారి కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన దేవర గ్లింప్స్ సోషల్‌ మీడియాలో సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేసింది. ఎన్టీఆర్‌ రోల్‌ మీద భీభత్సమైన ఇంట్రస్ట్  క్రియేట్‌ చేసింది. ఈ చిత్రంలో ఆయనతో పాటు ప్రకాష్‌రాజ్‌, శ్రీకాంత్‌, షైన్‌ టామ్‌ చాకో, నరేన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ప్యాన్‌ ఇండియా లెవల్లో అద్భుతమైన క్రేజ్‌ తెచ్చుకున్న దేవర చిత్రాన్ని నందమూరి కల్యాణ్‌ రామ్‌ సమర్పిస్తున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్,  యువ సుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మిక్కిలినేని సుధాకర్‌, హరికృష్ణ.కె. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అనిరుద్‌ రవిచంద్రన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడిటింగ్‌ చేస్తున్నారు. ఆర్‌. రత్నవేల్‌ తన కెమెరా పనితనంతో మిరాకిల్స్ సృష్టిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రొడక్షన్‌ డిజైనర్‌గా సాబు సిరిల్‌ వ్యవహరిస్తున్నారు

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

10 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago