ఈ నెల 23న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “డీమాంటీ కాలనీ 2”

Must Read

బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ “డీమాంటీ కాలనీ 2” ఈ నెల 23న తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ సినిమాలో అరుల్ నిధి, ప్రియ భవానీ శంకర్ జంటగా నటించారు. అన్తి జాస్కేలైనెన్, సెరింగ్ డోర్జీ, అరుణ్ పాండియన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని జ్ఞానముత్తు పట్టరై, వైట్ నైట్స్ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి రాజ్ వర్మ ఎంటర్ టైన్ మెంట్, శ్రీ బాలాజీ ఫిలింస్ నిర్మిస్తున్నాయి. విజయ సుబ్రహ్మణ్యం, ఆర్.సి.రాజ్ కుమార్ నిర్మాతలు. దర్శకుడు అజయ్ ఆర్ జ్ఞానముత్తు రూపొందించారు.

“డీమాంటీ కాలనీ 2” సినిమా ఈ నెల 15న తమిళంలో రిలీజై మంచి సక్సెస్ అందుకుంది. “తంగలాన్” వంటి పెద్ద సినిమాతో రిలీజై బాక్సాఫీస్ వద్ద పోటీని తట్టుకుని ప్రేక్షకాదరణ పొందుతోంది. “డీమాంటీ కాలనీ 2” తెలుగులో ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హరర్ థ్రిల్లర్స్ ను బాగా ఇష్టపడే తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకు ఘన విజయాన్ని అందిస్తారని మూవీ టీమ్ ఆశిస్తోంది. ఇప్పటికే తెలుగులో రిలీజైన “డీమాంటీ కాలనీ 2” ట్రైలర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. థియేటర్స్ లోనూ ఇదే రిజల్ట్ ను ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు మేకర్స్.

నటీనటులు – అరుల్ నిధి, ప్రియ భవానీ శంకర్, అన్తి జాస్కేలైనెన్, సెరింగ్ డోర్జీ, అరుణ్ పాండియన్, ముత్తుకుమార్, మీనాక్షి గోవింద్ రాజన్, సర్జనో ఖాలిద్, అర్చన రవిచంద్రన్

టెక్నికల్ టీమ్

మ్యూజిక్ – సామ్ సీఎస్
సినిమాటోగ్రఫీ – హరీశ్ కన్నన్
ఎడిటర్ – కుమరేష్.డి.
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
ప్రొడ్యూసర్స్ – విజయసుబ్రహ్మణ్యన్, ఆర్.సి.రాజ్ కుమార్
కో ప్రొడ్యూసర్స్ – బి సురేష్ రెడ్డి, బి.మానస రెడ్డి
రచన దర్శకత్వం – అజయ్ ఆర్ జ్ఞానముత్తు

Latest News

Daaku Maharaaj’s Third Song “Dabidi Dibidi”

The much-anticipated third song from Daaku Maharaaj, titled "Dabidi Dibidi," is here and setting social media on fire! This...

More News