ప్రతాని రామకృష్ణగౌడ్‌ స్వీయ దర్శకత్వంలో “దీక్ష” మూవీ

ఆర్‌.కె. ఫిలింస్‌, స్నిగ్ధ క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై ప్రముఖ దర్శక, నిర్మాత, తెలంగాణ ఫిలిమ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘దీక్ష’. పినిశెట్టి అశోక్‌ కుమార్‌ నిర్మాత. కిరణ్‌కుమార్‌, అలేఖ్యరెడ్డి జంటగా నటిస్తున్నారు. తాజాగా జరిగిన కార్యక్రమంలో ఈ చిత్ర ప్రోగ్రెస్ ను తెలిపారు దర్శక నిర్మాత ఆర్ కే గౌడ్. ఈ కార్యక్రమంలో హీరో కిరణ్, నటుడు జేవీఆర్, నటి తులసి, అనూష పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆర్‌.కె.గౌడ్‌ మాట్లాడుతూ – మా ‘దీక్ష’సినిమా షూటింగ్ పూర్తయింది. గ్రాఫిక్ వర్క్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. “దీక్ష” ఉంటే ఏదైనా సాధించగలం అనే పాయింట్ తో మూవీని తెరకెక్కించాం ఈ మూవీలో హీరో కిరణ్ పర్ ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. ఆయనకు హీరోగా మంచి పేరు తెచ్చే చిత్రమిది. అలాగే జేవీఆర్ గారు ఓ కీ రోల్ చేశారు. ఆయనకు ధర్మవరపు సుబ్రహ్మణ్యం లాంటి ఇమేజ్ వస్తుంది. తులసి, అనూష ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. అందంగా తెరపై కనిపిస్తారు. వారికి కూడా ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా. కిరణ్ , జేవీఆర్ గారు మా నెక్ట్ మూవీ మహిళా కబడ్డీ సినిమాలనూ నటించబోతున్నారు. ‘దీక్ష’ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత మహిళా కబడ్డీ సినిమాను లాంఛ్ చేస్తాం. అన్నారు

హీరో కిరణ్ మాట్లాడుతూ – ‘దీక్ష’ మూవీలో హీరోగా నటించే అవకాశం ఇచ్చిన ఆర్కే గౌడ్ అన్నగారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఆయన ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా రూపొందించారు. ‘దీక్ష’ చిత్రంతో హీరోగా నాకు మంచి పేరొస్తుంది ఆశిస్తున్నా. ఈ సినిమాలో ఒక నిమిషం పాటు ఉండే సంస్కృత డైలాగ్ ఒకటి నాతో చెప్పించారు. ఆ డైలాగ్ కు సినిమాకు హైలైట్ అవుతుంది. నెక్ట్ ఆర్కే గౌడ్ గారితో చేస్తున్న మహిళా కబడ్డీ లో పూర్తిగా డిఫరెంట్ గా కనిపించబోతున్నా. త్వరలోనే మా ‘దీక్ష’సినిమా మీ ముందుకు రాబోతోంది. మీరంతా తప్పకుండా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

నటుడు జేవీఆర్ మాట్లాడుతూ – ప్రొడ్యూసర్ గా, దర్శకుడిగా మంచి అనుభవం ఉన్న ఆర్ కె గౌడ్ గారు ఈ సినిమాను అందరికీ నచ్చేలా రూపొందించారు. ఈ సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నా. ‘దీక్ష’ మూవీతో హీరో కిరణ్ కు మంచి పేరు రావాలని కోరుకుంటున్నా. అలాగే తులసి, అనూష గుర్తింపు తెచ్చుకోవాలి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను అలరించే అంశాలు ‘దీక్ష’ మూవీలో ఉన్నాయి. అన్నారు.

నటి అనూష మాట్లాడుతూ – ‘దీక్ష’ సినిమాలో హీరో, హీరోయిన్ కాంబినేషన్ లో నా క్యారెక్టర్ ఉంటుంది. ఇలాంటి మంచి క్యారెక్టర్ లో నటించే అవకాశం ఇచ్చిన డైరెక్టర్, ప్రొడ్యూసర్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమాతో నాకు నటిగా గుర్తింపు దక్కుతుందని ఆశిస్తున్నా. త్వరలో రిలీజ్ అవుతున్న ‘దీక్ష’ సినిమాను చూసి ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటి తులసి మాట్లాడుతూ – ఈ సినిమాలో హీరో కిరణ్, హీరోయిన్ అలేఖ్యరెడ్డి తో పాటు మరో లీడ్ రోల్ లో నేను నటించాను. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన ఆర్కే గౌడ్ గారికి థ్యాంక్స్. నటిగా నాకు గుర్తింపు తెచ్చే చిత్రమవుతుంది. ‘దీక్ష’సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

7 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

7 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

7 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago