యంగ్ ట్యాలెంటెడ్ చైతన్య రావ్, యష్ణ చౌదరి లీడ్ రోల్స్ లో నటించిన చిత్రం ‘డియర్ నాన్న’. సూర్య కుమార్ భగవాన్ దాస్, సంధ్య జనక్, శశాంక్, మధునందన్, సుప్రజ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అంజి సలాది దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రాకేష్ మహంకాళి కథ అందించడంతో పాటు స్వయంగా నిర్మించారు.
ఈ చిత్రం ఆగస్ట్ 1 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ స్ట్రీమింగ్ కానుంది. కరోనా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో సత్తా చాటింది. హ్యూస్టన్ ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024 రెమి అవార్డు విజేతగా నిలిచింది డియర్ నాన్న.
చెఫ్ కావాలని కలులు కనే చైతన్య రావ్ తన జీవితంలో ఎదురైన సంఘటనలు, తనలో కలిగిన మార్పుని దర్శకుడు అంజి సలాది ఆలోచన రేకెత్తించే విధంగా ఎఫెక్టివ్ గా ఇందులో చూపించబోతున్నారు. కరోనా సమయంలో మెడికల్ షాప్ ల ప్రాధాన్యత, వారు చేసిన త్యాగాలని అద్భుతంగా చూపించారు. ఫాదర్ ఎమోషన్ సన్ ఎమోషన్ లో ఇందులో మరో హైలెట్. చైతన్య రావ్, సూర్య కుమార్ భగవాన్ దాస్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులని అలరించబోతున్నాయి.
ఈ చిత్రంలో సివిఎల్ నరసింహ, ఆదిత్య వరుణ్, వినీల్ ఇతరకీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిత్ కుమార్ మాధాడి డీవోపీగా పని చేస్తున్న ఈ చిత్రానికి గిఫ్టన్ ఎలియాస్ మ్యూజిక్ డైరెక్టర్. శ్రవణ్ కటికనేని ఎడిటర్.
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…