రోజుకో స్పెషల్ సర్పరైజ్ తో మార్వెల్ మూవీ ఫ్యాన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు డెడ్ పుల్ & వాల్వరిన్ టీమ్. రయన్ రెనాల్డ్స్, హుయ్ జాక్ మెన్ ప్రథాన పాత్రల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ రేంజ్ లో జూలై 26న విడుదలవ్వనున్న చిత్రం డెడ్ పుల్ & వాల్వరిన్. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి విడుదలైన టీజర్లు, ట్రైలర్లు ఇప్పటికే వరల్డ్ వైడ్ ఫుల్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు ఆ క్రేజ్ ని మరింతగా పెంచేస్తూ డెడ్ పుల్ & వాల్వరిన్ చిత్ర బృందం ఫైనల్ ట్రైలర్ ని విడుదల చేశారు. ఇప్పటివరుకు విడుదలైన ప్రతి వీడియో కంటెంట్ లో ఏదొక స్పెషల్ అప్పీరెన్స్ ను పరిచయం చేస్తూ సినిమాలో డెడ్ పుల్ & వాల్వరిన్ తో పాటు ఇంకా చాలా మంది సూపర్ హీరోలు ఉన్నారనే హింట్స్ ఇస్తూ వస్తున్న మార్వెల్ టీమ్, తాజాగా విడుదల చేసిన ఫైనల్ ట్రైలర్ లో కూడా అదే పంధా కొనసాగించారు.
ఈ ట్రైలర్ లో లేడీ డెడ్ పుల్ అలానే వాల్వరిన్ కూతుర్ని పరిచయం చేశారు. డెడ్ పుల్ చేసే విన్యాసాలును ఎంజాయ్ చేసే మార్వెల్ మూవీ లవర్స్ ఇప్పుడు లేడీ డెడ్ పుల్ చేసే యాక్షన్ ని కూడా చూడబోతున్నారు. డెడ్ పుల్ & వాల్వరిన్ ఇంగ్లీష్ తో పాటు అనేక భాషల్లో విడుదలవ్వనుంది. తెలుగులో డెడ్ పుల్ సిరీస్ కి ఉన్న క్రేజ్ రీత్య డెడ్ పుల్ & వాల్వరిన్ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.
కేవలం ఐదు రోజుల్లో రూ.100.2 కోట్ల గ్రాస్ సాధించిన 'అనగనగా ఒక రాజు'నవీన్ పొలిశెట్టి కెరీర్లోనే అతిపెద్ద విజయంయూఎస్లో హ్యాట్రిక్…
వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో బహు భాషా నటుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న స్టార్ దుల్కర్ సల్మాన్. కంటెంట్ బేస్డ్ మూవీస్…
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…