దసరా, హాయ్ నాన్న SIIMA, ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో రికార్డ్ నామినేషన్‌లతో నాని గ్రేట్ అచీవ్మెంట్

Must Read

నేచురల్ స్టార్ నాని వరుస బ్లాక్ బస్టర్స్‌ ఇచ్చే మోస్ట్ బ్యాంకబుల్ స్టార్లలో ఒకరు. నాని గత రెండు సినిమాలు- దసరా,  హాయ్ నాన్న  సెన్సేషనల్ సక్సెస్ సాధించాయి.  హై బడ్జెట్‌తో రూపొందిన దసరా విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలను అందుకోవడంతో పాటు, 2023లో బిగ్గెస్ట్ హిట్‌లలో ఒకటిగా నిలిచింది. హాయ్ నాన్న కూడా కమర్షియల్ హిట్ అయ్యింది, కంటెంట్, పెర్ఫార్మెన్స్ , టెక్నికల్ గా చాలా ప్రశంసలు అందుకుంది.

ఇప్పుడు నాని దసరా, హాయ్ నాన్న SIIMA,  ఫిల్మ్‌ఫేర్ అవార్డులలో రికార్డ్ నామినేషన్‌లను పొందాయి. హాయ్ నాన్న 10 SIIMA అవార్డులు, 9 ఫిల్మ్‌ఫేర్ అవార్డులకు నామినేట్ కాగా, దసరాకు SIIMAలో 11 నామినేషన్లు, ఫిల్మ్‌ఫేర్ అవార్డులలో 8 నామినేషన్లు వచ్చాయి.

నాని అందించిన గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా డెబ్యు చేసిన చిత్రం దసరా. ఇక, హాయ్ నాన్నతో దర్శకుడిగా డెబ్యు చేసిన శౌర్యువ్ కూడా హిట్ అందించడంలో సక్సెస్ అయ్యాడు. శ్రీకాంత్ ఓదెల, శౌర్యువ్ ఇద్దరూ ఉత్తమ దర్శకుల విభాగంలో నామినేట్ అయ్యారు.

స్క్రిప్ట్‌లు, డెబ్యూ డైరెక్టర్లపై నమ్మకాన్ని ఉంచినందుకు నాని ప్రశంసలు అందుకున్నాడు. అంతేకాదు ఈ రెండు సినిమాల్లో రెండు విభిన్నమైన పాత్రల్లో అలరించారు.

దసరాలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తే, హాయ్ నాన్నాలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించింది. ఈ ఇద్దరు హీరోయిన్లు కూడా నామినేట్ అయ్యారు.  

ఒకే క్యాలెండర్ ఇయర్‌లో మేజర్ అవార్డుల్లో ఇన్ని నామినేషన్లు అందుకోవడం నాని గ్రేట్ అచీవ్మెంట్.

Latest News

తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌

సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ రోజు (బుధవారం) పరామర్శించారు. శ్రీతేజ్‌ యోగా...

More News