బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ నుంచి మూడవ గీతం ‘దబిడి దిబిడి’ విడుదల

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథనాయకుడిగా నటించిన సినిమా విడుదలవుతుందంటే తెలుగునాట ఉండే సందడే వేరు. ఈ సంక్రాంతికి ఆయన ‘డాకు మహారాజ్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు రెండు పాటలు విడుదల కాగా, రెండింటికీ మంచి స్పందన లభించింది. ఇక ఇప్పుడు మూడవ గీతం విడుదలైంది.

‘డాకు మహారాజ్’ చిత్రం నుంచి అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న మూడవ గీతం ‘దబిడి దిబిడి’ని తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. విడుదలైన కొద్ది నిమిషాల్లోనే ఈ పాట సామాజిక మాధ్యమాల్లో ఒక ఊపు ఊపుతోంది. నందమూరి బాలకృష్ణ అంటే డైలాగ్ లకు పెట్టింది పేరు. అలాంటి బాలకృష్ణ చిత్రాలలోని అత్యంత ప్రజాదరణ పొందిన డైలాగ్ లతో రూపుదిద్దుకున్న ‘దబిడి దిబిడి’ గీతం అభిమానులకు నిజమైన విందును అందిస్తోంది. ఈ మాస్ నృత్య గీతాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించారు. ఈ పాటలో బాలకృష్ణతో కలిసి ఊర్వశి రౌతేలా కాలు కదిపారు. తమ అసాధారణ ఎనర్జీతో, అదిరిపోయే స్టెప్పులతో మాస్ ప్రేక్షకులు మెచ్చేలా పాటను మలిచారు.

నందమూరి బాలకృష్ణ సినిమా అంటే తమన్ ఏ స్థాయిలో సంగీతం అందిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి కలయికలో వచ్చే ప్రతి పాట ప్రేక్షకులని రంజింపచేస్తుంది. ఇప్పుడు ‘దబిడి దిబిడి’ కోసం తమన్ మరోసారి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. వాగ్దేవి తన శక్తివంతమైన గాత్రంతో పాటను మరో స్థాయికి తీసుకెళ్ళారు. ఇక ప్రతిభావంతులైన గీత రచయిత కాసర్ల శ్యామ్ సాహిత్యం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. సంగీతానికి తగ్గట్టుగా డైలాగ్ లతో అద్భుతమైన సాహిత్యం అందించారు. సంగీతం, సాహిత్యం చక్కగా కుదిరి.. ఇది గొప్ప నృత్య గీతంగా మారింది. “జై బాలయ్య” తరహాలో అభిమానుల హృదయాల్లో ఈ పాట నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు. విజయ్ కార్తీక్ కన్నన్ అద్భుతమైన విజువల్స్, శేఖర్ వీజే అదిరిపోయే కొరియోగ్రఫీ ఈ పాటను నిజమైన మాస్ ట్రీట్ లా మార్చాయి. అభిమానులతో పాటు, అన్ని వయసుల వారు కాలు కదిపేలా ఉన్న ఈ గీతం, ఖచ్చితంగా చాలా కాలం వినిపించే పాటగా నిలుస్తుంది.

నందమూరి అభిమానులతో పాటు, సినీ ప్రియులకు ఒక గొప్ప అనుభూతిని అందించేలా డాకు మహారాజ్ చిత్రాన్ని దర్శకుడు బాబీ కొల్లి రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ కార్తీక్ కన్నన్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తుండగా, నిరంజన్ దేవరమానే, రూబెన్ ఎడిటింగ్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకరా స్టూడియోస్ సమర్పిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12, 2025 న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. యాక్షన్, వినోదం, భావోద్వేగాల మేళవింపుతో రూపొందిన డాకు మహారాజ్ చిత్రంతో ప్రేక్షకులను గొప్ప సినిమా అనుభూతిని అందిస్తామని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.

తారాగణం: నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా
సంగీతం: తమన్ ఎస్
ఛాయాగ్రహణం: విజయ్ కార్తీక్
కళా దర్శకుడు: అవినాష్ కొల్లా
కూర్పు: నిరంజన్ దేవరమానే, రూబెన్
దర్శకత్వం: బాబీ కొల్లి
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
పి ఆర్ ఓ: లక్ష్మీవేణుగోపాల్

Tfja Team

Recent Posts

త్వ‌ర‌లోనే నితిన్ 36వ సినిమా షూటింగ్ ప్రారంభం

నితిన్ హీరోగా వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీనివాస సిల్వ‌ర్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై రూపొంద‌నున్న యూనిక్ సైఫై ఎంట‌ర్‌టైన‌ర్‌.. వైవిధ్య‌మైన సినిమాలు, పాత్ర‌ల‌తో…

2 days ago

ప్రముఖ సినీ గీత రచయిత పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కాంస్య విగ్రహవిష్కరణ

తానా సాహిత్య విభాగం - తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో మరియు అనకాపల్లి సిరివెన్నెల…

2 days ago

రికార్డులు తిరగరాస్తున్న స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి

కేవలం ఐదు రోజుల్లో రూ.100.2 కోట్ల గ్రాస్ సాధించిన 'అనగనగా ఒక రాజు'నవీన్‌ పొలిశెట్టి కెరీర్‌లోనే అతిపెద్ద విజయంయూఎస్‌లో హ్యాట్రిక్…

1 week ago

దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ చిత్రం నుంచి సాత్విక వీరవల్లి పరిచయం

వైవిధ్య‌మైన సినిమాలు, పాత్ర‌ల‌తో బ‌హు భాషా న‌టుడిగా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న స్టార్‌ దుల్క‌ర్ స‌ల్మాన్. కంటెంట్ బేస్డ్ మూవీస్…

1 week ago

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

3 weeks ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

3 weeks ago