బాలకృష్ణ గారి కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం ‘డాకు మహారాజ్’ : ప్రెస్ మీట్ లో చిత్ర దర్శక నిర్మాతలు
నందమూరి అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘డాకు మహారాజ్’. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథనాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ‘డాకు మహారాజ్’ చిత్రం సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ప్రచార చిత్రాలతో ఆ అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రచార కార్యక్రమాలలో జోరు పెంచిన చిత్ర బృందం తాజాగా విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పాల్గొన్న నిర్మాత సూర్యదేవర నాగవంశీ, దర్శకుడు బాబీ కొల్లి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, “గత 20-30 ఏళ్ళలో బాలకృష్ణ గారిని చూడనంత కొత్తగా ‘డాకు మహారాజ్’లో కనిపించబోతున్నారు. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం మాకుంది. బాలకృష్ణ గారి కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రాలలో ఒకటిగా ‘డాకు మహారాజ్’ నిలుస్తుంది. జనవరి 12న ప్రపంచం వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేయబోతున్నాం. ప్రచార కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నాం. ముఖ్యంగా మూడు భారీ వేడుకలను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాము. జనవరి 2న హైదరాబాద్ లో ట్రైలర్ విడుదల వేడుక జరపాలి అనుకుంటున్నాం. జనవరి 4న యూఎస్ లో ప్రీ రిలీజ్ వేడుక చేసి, ఒక పాట విడుదల చేయాలి అనుకుంటున్నాం. జనవరి 8న ఆంధ్రాలో ప్రీ రిలీజ్ వేడుక ప్లాన్ చేస్తున్నాం.” అన్నారు.
దర్శకుడు బాబీ కొల్లి మాట్లాడుతూ, ” పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. వంశీ గారు చెప్పినట్లు, సినిమా చాలా బాగా వచ్చింది. బాలకృష్ణ గారి నుంచి ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. అదే సమయంలో ఈ సినిమా విజువల్ గా ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని ఇస్తుంది. మీరు ఊహించిన దానికంటే బ్రహ్మాండమైన యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. అలాగే ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ ఉంటాయి. దర్శకుడు ఏం చెప్తే అది నూటికి నూరు శాతం బాలకృష్ణ గారు చేస్తారు. అలాంటి హీరోతో ఏదైనా కొత్తగా చేద్దామని చేసిన ప్రయత్నమే డాకు మహారాజ్. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఈ సినిమా ఉంటుంది.” అన్నారు.
‘డాకు మహారాజ్’ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ తో పాటు ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంచలన స్వరకర్త తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు విజయ్ కార్తీక్ కన్నన్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కళా దర్శకుడిగా అవినాష్ కొల్లా, ఎడిటర్ గా నిరంజన్ దేవరమానే వ్యవహరిస్తున్నారు.
Charan Sai and Usha sri are playing the lead roles in the upcoming movie It's…
చరణ్ సాయి, ఉషశ్రీ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా ఇట్స్ ఓకే గురు. ఈ చిత్రాన్ని వండర్ బిల్ట్…
The lyrical video of The Rage of Daaku from the upcoming action-packed entertainer Daaku Maharaaj…
కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ, ప్రతి చిత్రంతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ, వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్…
The highly anticipated movie Daaku Maharaaj, starring Nandamuri Balakrishna, is gearing up for its grand…
Promising hero Aadi Saikumar celebrates his birthday today, and to mark the occasion, the makers…