డి సురేష్ బాబు, రానా దగ్గుబాటి, సునీల్ నారంగ్ , పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్త నిర్మాణంలో రెండు చిత్రాల ప్రకటన

Must Read

డి సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్స్ గత కొన్ని దశాబ్దాలుగా ఫిల్మ్ మేకింగ్, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ బిజినెస్‌లో ఉంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద మల్టీప్లెక్స్ చైన్‌గా ఏషియన్ గ్రూప్ ఉంది. హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి సినిమాలు చేయడానికి తన సొంత ప్రొడక్షన్ బ్యానర్ స్పిరిట్ మీడియాను ప్రారంభించారు

డి సురేష్ బాబు, రానా దగ్గుబాటి, సునీల్ నారంగ్ మరియు పుస్కూర్ రామ్ మోహన్ రావు దసరా సందర్భంగా తాము కలసి పని చేస్తున్నట్లు వెల్లడించారు. తమ సంయుక్త నిర్మాణంలో  రెండు సినిమాలు చేయబోతున్నట్లు ప్రకటించారు.

“డి.సురేష్ బాబు, రానా దగ్గుబాటి, సునీల్ నారంగ్,  పుస్కుర్ రామ్ మోహన్ రావు తమ నిర్మాణ సంస్థలైన సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి.  స్పిరిట్ మీడియా,  శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP (SVCLLP – ఏషియన్ గ్రూప్) సంయుక్తంగా రెండు చిత్రాలు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఈ సినిమాలకు సంబంధించిన వివరాలు త్వరలో తెలియజేస్తాం” అని ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

ప్రముఖ ప్రొడక్షన్ హౌస్‌ల నుండి జాయింట్ ప్రొడక్షన్ వెంచర్‌లు గా వస్తున్న ఈ చిత్రాలకి సంబధించిన కంటెంట్, ప్రొడక్షన్ వాల్యూస్ , టెక్నికాలిటీస్ సహజంగానే అత్యున్నతంగా వుంటాయి.

Latest News

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ థియేట‌ర్స్‌లో సంద‌డి చేస్తోన్న‌సినిమా ధనుష్, కృతి...

More News