కౌంట్ డౌన్ షురూ.. కింగ్ ఖాన్ షారూక్ ‘జవాన్’ ప్రివ్యూ .. జూలై 10, ఉదయం 10.30 నిమిషాలకు ఫిక్స్
ఎంటైర్ ఇండియా ఎంతో ఆసక్తిగా గమనిస్తోన్న భారీ బడ్జెట్ మూవీ ‘జవాన్’. ప్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ‘జవాన్’ ప్రివ్యూకి డేట్, టైమ్ ఖరారైంది. జూలై 10, ఉదయం 10 గంటల 30 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్లు కింగ్ ఖాన్ షారూక్ తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ ప్రకటనతో అభిమానులు, ప్రేక్షకుల అంచనాలు రెట్టింపు అయ్యాయి.
‘జవాన్’ సినిమాను ప్రకటించినప్పటి నుంచి ఈ మూవీ ఎలా ఉండబోతుందా? అసలు షారూక్ ఖాన్ స్టార్ డమ్‌ను అట్లీ ఎలా చూపించబోతున్నారు? అసలు సినిమా అన్నీ వర్గాలను ఆకట్టుకుంటుందా? అని అందరూ చర్చించుకుంటున్నారు. సినీ ప్రేక్షకులు, మీడియా వర్గాలన్నీ ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో ప్రివ్యూ డేట్, టైమ్ ప్రకటించారు. దీంతో సినిమాపై జాతీయ స్థాయిలో సోషల్ మీడియా సహా ఇతరత్రా వాటిలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
క్యాలెండర్‌లో జవాన్ ప్రివ్యూ డేట్‌ను మార్క్ చేసుకోండి. మాతో పాటు కౌండట్ డౌన్‌లో అందరూ భాగస్వామ్యం కావాలని మేకర్స్ ప్రేక్షకులకు తెలియజేశారు. ఇప్పటి వరకు షారూక్ ఖాన్‌ను సిల్వర్ స్క్రీన్‌పై చూడని విధంగా చూడబోతున్నారు. ఈ సినిమాటిక్ జర్నీ ప్రేక్షకులకు ఓ అద్భుతమైన అనుభూతిని అందిచనుందనటంలో సందేహం లేదు. మరింత ఎగ్జయిట్‌మెంట్, అప్‌డేట్స్ కోసం ఎదురు చూసేలా ప్రివ్యూ డేట్ అనౌన్స్‌మెంట్ సిద్ధం చేసింది.
రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ సమర్పణలో గౌరీ ఖాన్ నిర్మాతగా జవాన్ సినిమాను నిర్మిస్తున్నారు. అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. గౌరవ్ వర్మ సహ నిర్మాత. ప్రపంచ వ్యాప్తంగా ‘జవాన్’ చిత్రం సెప్టెంబర్ 7న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…
లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…