నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యదు వంశీ దర్శకుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న వంశీ నందిపాటి విడుదల చేశారు. డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్, అటు యూత్‌ను ఆకట్టుకున్న ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అలాగే బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టుకుంటోంది.
ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలతో పాటు సినీ సెలబ్రిటీల అప్రిషియేషన్స్ కూడా అందుకుంటోంది ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా. సూపర్ స్టార్ మహేష్‌తో పాటు దర్శకధీరుడు రాజమౌళి, స్టార్ డైరెక్టర్ సుకుమార్ సహా హీరో నాని, డైరెక్టర్ నాగ్ అశ్విన్, డైరెక్టర్ క్రిష్, రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కమిటీ కుర్రోళ్ళు సాధించిన సక్సెస్‌ను అప్రిషియేట్ చేశారు.
‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంలో సీనియర్ నటీనటులతో పాటు 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు పరిచయం చేస్తూ మేకర్స్ చేసిన ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ ప్రేక్షకులు సినిమాను ఆదరించారని ..ఆదివారం కూడా ప్రేక్షకాదరణ పొందుతుందని, కలెక్షన్స్ మరింత పెరుగుతాయని ట్రేడ్ వర్గాలంటున్నాయి.
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఒకరికి ఒకరు వంటి సూపర్‌హిట్ చిత్రాలతో తెలుగులో అందరికి సుపరిచితుడైన కథానాయకుడు శ్రీరామ్. ఈయన…
తమ సబ్ స్క్రైబర్స్ కు మంచి ఎంటర్ టైన్ మెంట్ అందిస్తామనే ప్రామిస్ ను నిలబెట్టుకుంటూ బ్యాక్ టు బ్యాక్…
శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతోన్న కొత్త…
ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు (ఎన్.టి.ఆర్) వ్యక్తిత్వ మరియు ప్రచార హక్కులను రక్షణ కల్పించేలా గౌరవనీయ ఢిల్లీ హైకోర్టు…
దీక్షిత్ శెట్టి, క్రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో ప్రేమ్ చంద్ కిలారు తెరకెక్కించిన చిత్రం ‘శబార’. విశ్రమ్ ఫిల్మ్ ఫ్రాటర్నిటీ…
అమరావతి, జనవరి 28 :- అలనాటి మేటినటి, నిర్మాత, కృష్ణవేణి జీవిత చరిత్రను ‘మీర్జాపురం రాణి-కృష్ణవేణి’ అనే పేరుతో సీనియర్…