నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యదు వంశీ దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 9న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 12నుంచి ఈటీవి విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ‘కమిటీ కుర్రోళ్ళు’ టీం ప్రీ స్ట్రీమింగ్ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా నిర్వహించింది.
ప్రీ స్ట్రీమింగ్ సెలబ్రేషన్స్ లో ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల మాట్లాడుతూ.. మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియన్స్ కి మరోసారి థాంక్ యూ సో మచ్. నా ఇండస్ట్రీ జర్నీ ఈటీవీ డీ జూనియర్స్ షో తో స్టార్ట్ చేశాను. నన్ను ఆడియన్స్ కి పరిచయం చేసిన ఈటీవీకి థాంక్ యూ సో మచ్. ఈటీవిలో వచ్చే కంటెంట్ మీ మా మన అనుకునేలా వుంటుంది.’కమిటీ కుర్రోళ్ళు’ అలాంటి సినిమానే. మీ సినిమాలా అనుకొని తీశాం. ఈ సినిమా ఈటీవీలో రావడం మేము తీసుకున్న బెస్ట్ డెసిషన్. సెప్టెంబర్ 12న ఈటీవి విన్ లో మా ‘కమిటీ కుర్రోళ్ళు’ రీరిలీజ్ అవుతుంది. థియేటర్ లో ఎలా అయితే పండగ, జాతరలా ఎంజాయ్ చేశారో, ఈటీవీ విన్ లో కూడా చూసి అలానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను’ అన్నారు.
డైరెక్టర్ యదు వంశీ మాట్లాడుతూ..‘కమిటీ కుర్రోళ్ళు’ని ప్రేక్షకులు వోన్ చేసుకున్నందుకు థాంక్ యూ సో మచ్. మీ అందరికీ రుణపడి వుంటాను. ఈ సినిమాలో నటించిన అందరూ గొప్ప నటులుగా కెరీర్ లో ముందుకు వెళ్తారు. ఈ అవకాశం ఇచ్చిన నిహారిక గారికి, రమేష్ గారికి ధన్యవాదాలు. ఒక మెమరనీ బంధించి , అందరి బయోపిక్ గా సినిమాని మీ ముందుపెట్టాం. ఈ సినిమా ఈటీవి విన్ లో రావడం చాలా ఆనందంగా వుంది. ఇది పక్కా తెలుగు సినిమా. ఇలాంటి సినిమా ఈటీవీ విన్ లో వుండాలి. ఈ సినిమాని ప్రోత్సహించి నిహారిక గారికి, ఈటీవి విన్ కి ధన్యవాదాలు. 12న ఈ సినిమా ఈటీవీ విన్ లో వస్తుంది. అందరూ చూసి సపోర్ట్ చేయాలి’ అని కోరారు.
‘కమిటీ కుర్రోళ్ళు’ గా నటించిన యాక్టర్స్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సినిమా విడుదలై నెల రోజులౌతుంది. కానీ ఈ రోజే రిలీజైన ఫీలింగ్ వుంది. చూసిన ప్రతి ఒక్కరి నుంచి ప్రసంశలు అందుతూనే వున్నాయి. మంచి కంటెంట్ ఇస్తే కొత్త పాత చూడకుండా థియేటర్స్ కి వచ్చి హిట్ చేస్తారని మా తెలుగు ఆడియన్స్ మరోసారి ప్రూవ్ చేశారు. మాకు ఒక గుర్తింపు ఇచ్చారు. ఈ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని మంచి కంటెంట్ వున్న సినిమాలు చేస్తాం. మా సినిమా ఈటీవీ విన్ లో రావడం చాలా ఆనందంగా వుంది. సెప్టెంబర్ 12న ఈ సినిమా ఈటీవీ విన్ లో వస్తుంది. అందరూ చూసి మమ్మల్ని సపోర్ట్ చేయాలి’ అని కోరారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మన్యం రమేష్ మాట్లాడుతూ.. ఈటీవిన్ లో మా సినిమా రావడం చాలా ఆనందంగా వుంది. మయూరీ, మౌనరాగం లాంటి కంటెంట్ వుండే సినిమాలు తీసే సంస్థలో మా సినిమా రావడం గౌరవంగా వుంది. ఈటీవి విన్ ద్వారా ఈ సినిమా మ్యాగ్జిమమ్ ఆడియన్స్ కి చేరుతౌతుందని కోరుకుంటున్నాం’ అన్నారు.
ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయికృష్ణ మాట్లాడుతూ.. కమిటీ కుర్రోళ్ళు టీం కి థాంక్ యూ. చాలా బ్యూటీఫుల్ గా తీశారు. వంశీ చాలా పెద్ద డైరెక్టర్ అవుతారు. ఈ సినిమాని ఈటీవీ విన్ కి ఇచ్చిన నిహారిక గారికి ధన్యవాదాలు. ఈ రోజుల్లో సినిమాలకి థియేటర్, ఓటీటీ రిలీజుకు ఉంటున్నాయి. థియేటర్ రిలీజ్ కంటే ఎక్కువ రెస్పాన్స్ ఓటీటీ రిలీజ్ తర్వాత వుంటుంది నమ్ముతున్నాను. ఈ సినిమాలో పని చేసిన అందరికీ బ్రైట్ ఫ్యూచర్ వుండాలని కోరుకుంటున్నాను’ అన్నారు. సినిమా యూనిట్ సభ్యులంతా ఈ వేడుకలో పాల్గొన్నారు.
Rahasyam Idam Jagat" is a film blending science fiction and mythological thrillers. From the promotional…
మీ నేపథ్యం ఏమిటి:నాకు చిన్నప్పటి నుంచే నాకు సినిమాలంటే చాలా ఆసక్తి. మా నాన్న స్టేజీ షోలకు రైటర్. అమ్మ…
The film "Erra Cheera - The Beginning" is jointly produced by Sri Padmayal Entertainment and…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ -శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర -…
తమిళ్ ఇండస్ట్రీలో తెరకెక్కిన సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి మంచి విజయాలను అందుకుంటున్నాయి. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అంటూ…
Movies made in the Tamil industry are being dubbed in Telugu and achieving great success.Without…