‘కమిటీ కుర్రోళ్లు’ థియేటర్లో చూడాల్సిన చిత్రం. దర్శకుడు యదు వంశీ

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. అంతా కొత్త వారితో చేసిన ఈ చిత్రం ఇప్పటికే అందరిలోనూ అంచనాలు పెంచేసింది. ఈ మూవీ ఆగస్ట్ 9న రాబోతోంది. ఈ క్రమంలో రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో బుధవారం నాడు దర్శకుడు యదు వంశీ మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన విశేషాలివే..

* నేను ఓ ఇండీ ఫిల్మ్ తీశాను. ఆ చిత్రానికి మంచి పేరు వచ్చింది. నేను ఇంత వరకు ఎవరి దగ్గరా పని చేయలేదు. సినిమాలకు సంబంధించిన అనుభవం లేదు. కానీ ఈ కథను రాసుకుని చాలా ప్రొడక్షన్ కంపెనీలు తిరిగాను. చివరకు నిహారిక గారి వద్దకు ఈ కథ వెళ్లింది.

* మా ఊళ్లో జరిగే జాతరను బేస్ చేసుకుని ఈ కథను రాసుకున్నాను. ఇందులో ప్రతీ ఒక్కరి కథ ఉంటుంది. ప్రతీ కుర్రాడి కథ ఇందులో కనిపిస్తుంది. ఇందులో నా పర్సనల్ ఎక్స్‌పీరియెన్స్ కూడా ఉంటుంది.

* స్క్రీన్ మీద సినిమా ఎలా కనిపించాలనేది నిహారిక గారికి తెలుసు. దానికి ఏం కావాలో అన్నీ సమకూర్చారు. చెప్పింది చెప్పినట్టుగా తీసే ఫ్రీడం ఇచ్చారు. నిహారిక గారు మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఒకేలా ఉన్నారు.

* ఇలాంటి కథకు తెలిసిన వాళ్లు నటించి ఉంటే.. వాళ్లకంటూ సపరేట్ బ్యాగేజ్ ఉండేది. ఇందులో ప్రతీ పాత్ర కూడా హీరోలానే ఉంటుంది. అందుకే అందరూ కొత్త వాళ్లతోనే ట్రై చేశాను. ప్రసాద్ ఒక్కడే కాస్త తెలిసిన వ్యక్తి. పాత్రకు తగ్గట్టుగానే ఆయన నటించాడు. కథ కోసం అందరూ వెయిట్ లాస్, గెయిన్ అయ్యారు.

* నాకు ఈ కథ మీద చాలా నమ్మకం ఉంది. రెగ్యులర్ పంథాలో వెళ్లకూడదనే ఉద్దేశంలో ఇలాంటి కథను ఎంచుకున్నాను. 2019లో కొంత రీసెర్చ్ చేశాను. జయప్రకాష్ నారాయణ గారు, పవన్ కళ్యాణ్ గారు కొన్ని మాటలు మాట్లాడారు. వాళ్లు మాట్లాడిన కొన్ని మాటల స్పూర్తితోనే కొన్ని సీన్లను రాసుకున్నాను. ఫ్రెండ్ షిప్, పొలిటికల్ అంశాలను ఇందులో జొప్పించాను.

*  సాయి కుమార్ వంటి సీనియర్ గారెతో నటించడం ఆనందంగా ఉంది. మొదటి రెండ్రోజులు కాస్త భయపడ్డాను. కానీ ఆయన ఎంతో సపోర్ట్‌ ఇచ్చారు. ప్రతీ సీన్‌లో ఆయన అనుభవం చూపించారు.

*  సెట్‌లో అందరికీ ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వాలని వర్క్ షాప్స్ ఎక్కువగా చేశాను. చిరంజీవి గారు సినిమా చూసి అందరూ అద్భుతంగా నటించారని చెప్పడం, వరుణ్ తేజ్ గారు చూసి 11 మంది ఇరగ్గొట్టేశారని చెప్పడంతో చాలా ఆనందమేసింది.

*  కేరళలో ఉన్నంత అందం కోనసీమలో ఉంది. ఆ అందాన్ని మరింత అందంగా చూపించాం. మా రాజు గారు పెట్టిన లైటింగ్, చూపించిన విజువల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. 90వ దశకంలోకి తీసుకెళ్లగలిగాం. అనుదీప్ గారి పాటలు అందరినీ మెప్పించాయి.

* నెక్ట్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో కథను రాసుకుంటున్నాను. అందరూ భయపడేలా ఈ కథ ఉంటుంది. ఈ మూవీ పెద్ద హిట్ అయితే.. నేను అనుకున్న హీరోతోనే ఆ సినిమా చేస్తాను.

* మాలాంటి కొత్త వాళ్లతో సినిమా అంటే అందరూ బడ్జెట్ గురించి లిమిట్స్ పెడతారు. కానీ నిహారిక గారు ఎప్పుడూ బడ్జెట్ విషయాలు మా వరకు రానివ్వలేదు. సినిమాకు ఏం కావాలో అది చేశారు. ఆమె మా కంటెంట్‌ను నమ్మారు.

* ఇందులో మదర్ సెంటిమెంట్ అందరినీ కదిలిస్తుంది. థియేటర్లో ఆ సీన్ చూస్తే కంట్లోంచి నీళ్లు వస్తాయి. అమ్మ సెంటిమెంట్‌ను ఎంత బాగా చూపించాలో అంత బాగా చూపించాను. మన ఊరు.. మన కుర్రోళ్లు.. మన ప్రేమ.. మన భావోద్వేగాలు.. అన్ని రకాల అంశాలతో ఉన్న ఎంటర్టైన్మెంట్‌ను అందిస్తాం. థియేటర్లో చూడాల్సిన సినిమా. థియేటర్లో కూర్చుంటో నిజంగా జాతరలో ఉండి సినిమాను చూసినట్టుగా అనిపిస్తుంది. నిజంగానే కొంత మందికి పూనకాలు వచ్చాయి. ఈ మూవీని థియేటర్లో చూస్తేనే ఆ ఫీల్ వస్తుంది.

Tfja Team

Recent Posts

విజయ్ ఆంటోని పుట్టిన రోజు సందర్భంగా ‘నాన్న కుట్టి’ నుంచి కూల్ పోస్టర్ విడుదల

కంటెంట్‌కి ప్రాధాన్యతను నిస్తూ కథల్ని ఎంచుకుంటూ ఉంటారు విజయ్ ఆంటోని. ఆయన సినిమాలు అంటే తెలుగు ఆడియెన్స్‌లో సహజంగానే ఆసక్తి…

10 minutes ago

ఆగస్ట్ 1న రామ్ గోపాల్ వర్మ ‘రక్త చరిత్ర 2’ రీ రిలీజ్

హీరో సూర్య బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన ట్రైలర్ మాఫియా, హారర్, సస్పెన్స్ చిత్రాలను తీయడంతో పాటు యథార్థ…

21 hours ago

ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ “అదే నీవు అదే నేను”

ఇటీవల ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో రెండు అవార్డులు సాధించిన"కమిటీ కుర్రోళ్లు" మూవీ ఫేమ్ త్రినాథ్ వర్మ, యశ్వంత్…

1 day ago

మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ఘనంగా హీరో కిరణ్ అబ్బవరం “చెన్నై లవ్ స్టోరీ” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా "కలర్ ఫొటో", "బేబి" వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు…

1 day ago

‘యమకింకరుడు’ ట్రైలర్‌ విడుదల చేసిన “రాక్షసుడు” నిర్మాత కె.ఎస్. రామారావు!

(తెలుగులో మొదటి AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సినిమాగా ‘యమ కింకరుడు’) ప్రముఖ నిర్మాత, దర్శకుడు తుమ్మలపల్లి రామసత్యనారాయణ టైటిల్ పాత్ర…

2 days ago

‘మెయిన్ వాపస్ ఆవుంగా’ విజయోత్సవం – ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన ఇమ్తియాజ్ అలీ

హిందీ చిత్రం 'మెయిన్ వాపస్ ఆవుంగా' దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు వారాలు పూర్తయినా ఈ…

2 days ago