“సర్కిల్” హీరోయిన్స్ అర్షిణ్ మెహతా, రిచా పనై ఇంటర్వ్యూ

దర్శకుడు నీలకంఠ రూపొందించిన కొత్త సినిమా “సర్కిల్”. ఈ చిత్రంలో సాయి రోనక్, బాబా భాస్కర్, అర్షిణ్‌ మెహతా,రిచా పనై, నైనా కీలక పాత్రల్లో నటించారు. ఆరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎమ్.వి శరత్ చంద్ర, టి సుమలత అన్నిత్ రెడ్డి, వేణుబాబు అడ్డగడ నిర్మించారు. సరికొత్త థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని జూలై 7న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్రంలో నటించిన తమ అనుభవాలను ఇంటర్వ్యూలో తెలిపారు నాయికలు అర్షిణ్ మెహతా, రిచా పనై.

అర్షిణ్ మెహతా మాట్లాడుతూ – సల్మాన్ హీరోగా నటించిన భజ్రంగీ భాయిజాన్ చిత్రంలో జర్నలిస్ట్ పాత్రతో నా కెరీర్ మొదలుపెట్టాను. సర్కిల్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నాను. ఇప్పటిదాకా ఇక్కడి చిత్రాల్లో నటించిన అనుభవం లేదు. నీలకంఠ గారు నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్. ఆయన చిత్రంలో అవకాశం రావడం సంతోషంగా ఉంది. నీలకంఠ గారు క్యారెక్టర్, నటన విషయంలో చాలా పర్టిక్యులర్ గా ఉంటారు. ఈ సినిమాతో నటిగా చాలా విషయాలు నేర్చుకునే అవకాశం దొరికింది. ఈ చిత్రంలో ప్రిన్సెస్ పాత్ర నాది. హీరో ఫొటోగ్రాఫర్. వీరి మధ్య జరిగే ప్రేమ కథ ఆసక్తికరంగా ఉంటుంది. తెలుగు భాష రాదు కాబట్టి సెట్ లో ఇబ్బందిపడేదాన్ని. కానీ డైరెక్టర్ తో సహా టీమ్ చాలా సపోర్ట్ చేసి నేను బాగా నటించేలా చూసుకున్నారు. మన జీవితం అంటే మంచీ చెడుల సర్కిల్. ఈ చిత్రంలోనూ అదే విషయాన్ని చెప్పబోతున్నాం. సాయి రోనక్ మంచి కోస్టార్. ఎలాంటి ఇబ్బంది లేకుండా అతనితో కలిసి నటించాము. తెలుగులో చాలా మంది స్టార్ హీరోలు ఉన్నారు. ఇక్కడ మంచి అ‌వకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను.

రిచా పనై మాట్లాడుతూ – కెరీర్ లో గ్యాప్ కావాలని తీసుకున్నది కాదు. యముడికి మొగుడు, చందమామ కథలు, ఈడు గోల్ట్ ఎహె వంటి చిత్రాల్లో నటించాను. బృందావనమది అందరిదీ సినిమాలో నటించినా అది విడుదల కాలేదు. యముడికి మొగుడు, చందమామ కథలు చిత్రాల్లో నటించాక మంచి అవకాశాలు వస్తాయని ఆశించాను కానీ అనుకున్నంతగా సినిమాలు దక్కలేదు. ఇండస్ట్రీకి దూరమవడం ఇష్టం లేక వచ్చిన రెండు మూడు చిత్రాల్లో నటించాను. ఇప్పుడు సర్కిల్ చిత్రంలో నటించాను. ఇది జూలై 7న రిలీజ్ కు వస్తోంది. ఈ చిత్రంలో దర్శకుడు నీలకంఠ నా క్యారెక్టర్ ను కొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నారు. బోల్డ్ గా కనిపించే పాత్ర నాది. అయితే డిఫరెంట్ గా ఉంటుంది. నేను ఇలాంటి క్యారెక్టర్ ఇప్పటిదాకా చేయలేదు. ఈ సినిమా నటిగా నాకు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను. ఈ చిత్రంలో ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. హీరో లైఫ్ చుట్టూ కథ తిరుగుతుంది. ఆయన వెంట మేముంటాం. నేను పెయింటర్ పాత్రలో కనిపిస్తా. ఇవాళ అమ్మాయిలు ఎంత మోడరన్ గా, ఫ్రీడమ్ తో ఉన్నారో అలాగే తెరపై కనిపిస్తా. రొమాంటిక్, యాక్షన్, థ్రిల్లర్, ఎంటర్ టైనింగ్..ఇలా కథలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. మాంటేజ్ సాంగ్స్ ఆకర్షణ అవుతాయి. షూటింగ్ టైమ్ లో నేను, అర్షిణ్, సాయి రోనక్ స్టూడెంట్స్ లా నీలకంఠ గారి దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాం. ప్రస్తుతం కొన్ని ప్రాజెక్ట్స్ కు డిస్కషన్స్ జరుగుతున్నాయి.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

10 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

11 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

11 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago