చియాన్ విక్ర‌మ్ 62వ చిత్రం వీర ధీర శూరన్

Must Read

విలక్ష‌ణ‌మైన సినిమాలు, వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌టమే కాకుండా జాతీయ ఉత్త‌మ న‌టుడిగానూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న యాక్ట‌ర్ చియాన్ విక్ర‌మ్‌. బుధ‌వారం ఆయ‌న పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా మేక‌ర్స్ ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న తాజా చిత్రానికి సంబంధించిన టైటిల్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. చియాన్ 62వ చిత్రానికి ‘వీర ధీర శూరన్’ అనే టైటిల్‌ను క‌న్‌ఫ‌ర్మ్ చేశారు. త్వ‌ర‌లోనే తెలుగు టైటిల్‌ను ప్ర‌క‌టించ‌నున్నారు. ఎస్‌.జె.సూర్య‌, దుస‌రా విజ‌య‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. హెచ్‌.ఆర్‌.పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.యు.అరుణ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

‘వీర ధీర శూరన్’లో ప‌క్కా మాస్ అవ‌తార్‌లో చియాన్ విక్ర‌మ్ అభిమానుల‌ను మెప్పించ‌టం ఖాయంగా క‌నిపిస్తుంది. టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే హీరో పేరు కాళి. త‌న‌కు ఓ కిరాణా షాప్ ఉంటుంది. అందులో త‌ను ప‌ని చేసుకుంటుంటాడు. అత‌నితో అంత‌కు ముందే దెబ్బ‌లు తిన్న విల‌న్స్ జీపులు, వ్యాన్స్ వేసుకుని అక్క‌డికి చేరుకుంటారు. త‌మ‌ను కొట్టింది కిరాణా షాప్‌లో ఉన్న హీరో అని క‌న్‌ఫ‌ర్మ్ అయితే అత‌న్ని చంపేయాల‌నేది వారి ఆలోచ‌న‌.. అయితే విల‌న్స్ జాడ‌ను హీరో ప‌సిగ‌ట్టేస్తాడు. అక్క‌డ ప‌ని చేసుకుంటూనే విల‌న్స్‌ను ఏం చేయాలా అని ఆలోచిస్తుంటాడు. త‌మ‌ను కొట్టింది హీరో అని తెలియ‌గానే విల‌న్స్ క‌త్తులు తీసుకుని దాడి చేయ‌టానికి వస్తుంటారు. అంతే.. మ‌న క‌థానాయ‌కుడు అప్ప‌టి వ‌ర‌కు దాచి పెట్టిన తుపాకీ తీసుకుని ఓ విల‌న్ చెవికి గాయ‌మ‌య్యేట‌ట్లు కాల్చ‌డంలో దుండ‌గులు భ‌యంతో ప‌రుగులు తీస్తారు. షాప్‌లో ఉన్న క‌స్ట‌మ‌ర్ హీరో చేతిలోని గ‌న్ చూసి భ‌య‌ప‌డుతుంది. కానీ హీరో అదేమీ ప‌ట్టించుకోకుండా ఆమె కొన్న స‌రుకుల ఖ‌ర్చు ఎంత‌య్యిందనే విష‌యాన్ని చెప్ప‌టంతో షాపులోని లేడీ క‌స్ట‌మ‌ర్‌, ఓ ప‌క్క భ‌యం, మ‌రో ప‌క్క ఆశ్చ‌ర్యంతో నోరు వెల్ల‌బెట్టేస్తుంది.

225 సెక‌న్ల పాటుండే ‘వీర ధీర శూరన్’ టైటిల్ టీజ‌ర్‌లోనే అంత మాస్ ఎలిమెంట్స్ఉన్న‌ప్పుడు సినిమాలో ఇక ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక చియాన్ విక్ర‌మ్ మాస్ అవ‌తార్ కెవ్వు కేక అనిపించ‌టం ప‌క్కా అని తెలుస్తుంది. జి.వి.ప్ర‌కాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి తేని ఈశ్వ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ పేర్కొన్నారు.

న‌టీన‌టులు:

చియాన్ విక్ర‌మ్‌, ఎస్‌.జె.సూర్య‌, దుస‌రా విజ‌య‌న్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

బ్యాన‌ర్ : హెచ్‌.ఆర్‌.పిక్చ‌ర్స్‌, నిర్మాత‌: రియా శిబు, ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: ఎస్‌.యు.అరుణ్‌కుమార్‌, అసోసియేట్ ప్రొడ్యూస‌ర్‌: రోని జ‌కారియా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: అన్‌లిన్ లాల్‌, మ్యూజిక్‌: జి.వి.ప్ర‌కాష్ కుమార్‌, సినిమాటోగ్ర‌ఫీ: తేని ఈశ్వ‌ర్‌, ఆర్ట్‌: సి.ఎస్‌.బాల‌చంద‌ర్‌, కాస్ట్యూమ్స్‌: క‌విత‌.జె, పి.ఆర్‌.ఒ (తెలుగు): సురేంద్ర నాయుడు- ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా).

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News