చిత్రాల‌యం స్టూడియోస్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్‌’… శ‌ర‌వేగంగా మేఘాల‌య‌లో షూటింగ్‌!

ప్ర‌ముఖ నిర్మాత వేణు దోనేపూడి చిత్రాల‌యం స్టూడియోస్ తెర‌కెక్కిస్తున్న ట్రెండీ క్రైమ్ కామెడీ సినిమా ‘బా బా బ్లాక్ షీప్‌’. ప్ర‌స్తుతం మేఘాల‌య‌లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. అక్టోబ‌ర్‌లో ఈ సినిమా షూటింగ్ మొద‌లైంది. టిన్ను ఆనంద్‌, ఉపేంద్ర లిమ‌యే, జార్జ్ మ‌రియ‌న్‌, రాజా ర‌వీంద్ర‌, అక్ష‌య్ ల‌ఘుసాని, విష్ణు ఓ అయ్‌, కార్తికేయ దేవ్‌, క‌శ్య‌ప్‌, విస్మ‌య‌, మాల్వి మ‌ల్హోత్రా, స‌మృద్ధి ఆర్య‌ల్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

మేఘాల‌య‌లో సంపూర్ణంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న తొలి సినిమా బా బా బ్లాక్ షీప్‌ కావ‌డం గ‌మ‌నార్హం. ఒక రోజులో జ‌రిగే క‌థ‌తో తెర‌కెక్కుతోందీ సినిమా. ఆరుగురి మ‌ధ్య సాగే ఇంట్ర‌స్టింగ్ స్టోరీ ఇది. గ‌న్స్, గోల్డ్, హంట్ అంటూ ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. బా బా బ్లాక్ షీప్‌ గురించి వేణు దోనేపూడి మాట్లాడుతూ ‘‘మా బా బా బ్లాక్‌షీప్ మేఘాల‌యాలో పూర్తి స్థాయిలో షూటింగ్ చేసుకుంటున్న తొలి చిత్రం. క‌థ మొత్తం నార్త్ ఈస్ట్ ఇండియాలో సాగుతుంది కాబ‌ట్టి, ఇక్క‌డే చిత్రీక‌రిస్తున్నాం. క‌థ‌లోనే ఓ బ్యూటీ ఉంటుంది. జ‌ల‌పాతాలు, కొండ‌లు, అంద‌మైన ప్ర‌దేశాల్లో సాగే క‌థ ఇది. ఎన్నో చోట్ల రెక్కీ చేసి, మా క‌థ‌కు మేఘాల‌యా ప‌ర్ఫెక్ట్ గా సూట్ అవుతుంద‌ని ఇక్క‌డ ఫిక్స్ అయ్యాం’’ అని అన్నారు.

ఎప్పుడూ వ‌ర్షం కురుస్తూ ఉండే సోహ్రా (చిరపుంజి)లో ‘బా బా బ్లాక్ షీప్‌’ని తెర‌కెక్కిస్తున్నారు. ఎల్ల‌వేళ‌లా వ‌ర్షం పడుతూ ఉన్న చోట షూటింగ్ చేయ‌డం ఇబ్బందితో కూడిన వ్య‌వ‌హారం కాదా? ఇదే విష‌యం గురించి వేణు మాట్లాడుతూ ‘‘చాలా క‌ష్ట‌మైన వ్య‌వ‌హారం. అతి త‌క్కువ సంద‌ర్భాల్లో మాత్ర‌మే మ‌న‌కు కావాల్సిన లైటింగ్ ఉంటుంది. కానీ, అన్నిటినీ అధిగ‌మించి మా టీమ్ ఎంతో కృషి చేస్తున్నారు. త‌ప్ప‌కుండా మ‌న ప్రేక్ష‌కుల‌కు క‌నువిందు చేసే సినిమా అవుతుంది’’ అని అన్నారు.

స‌మిష్టి కృషిని, స‌మైక్య‌త‌ను విశ్వ‌సించే చిత్రాల‌యం స్టూడియోస్‌, ‘బా బా బ్లాక్ షీప్‌’ కోసం మేఘాల‌య ప్ర‌భుత్వంతో క‌లిసి ప‌నిచేస్తోంది. మేఘాల‌య ఛీఫ్ మినిస్ట‌ర్ మిస్ట‌ర్ క‌న్రాడ్ కె సంగ్మా ఇటీవ‌ల సినిమా యూనిట్‌ని క‌లిసి శుభాకాంక్ష‌లు తెలిపారు. మేఘాల‌య‌లో షూటింగ్ కోసం త‌మ వంతు సంపూర్ణ స‌హ‌కారాన్ని అందిస్తామ‌ని తెలిపారు.

అద్భుత‌మైన పాయింట్‌, ఎలాగైనా స‌క్సెస్ సాధించాల‌నే యూనిట్ ప‌ట్టుద‌ల‌, ఎక్స్ ట్రార్డిన‌రీ విజువ‌ల్స్… అన్నీ క‌లిసి బా బా బ్లాక్ షీప్‌ని ఆడియ‌న్స్ ముందు మంచి సినిమాగా నిల‌ప‌నున్నాయి. ప్ర‌తిభావంతుల‌ను ప్రోత్స‌హించ‌డంలో ఎప్పుడూ ముందుండే చిత్రాల‌యం స్టూడియోస్ ఈ సారి కొత్త ద‌ర్శ‌కుడు గుణి మాచికంటిని ఈ సినిమాతో ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం చేస్తున్నారు. సినిమాను రికార్డ్ టైమ్‌లో పూర్తి చేసి, అత్య‌ధిక మంది ప్రేక్ష‌కుల‌కు ప్రేమ‌తో అందించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ప‌నిచేస్తోంది మూవీ యూనిట్‌.

TFJA

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago