మెగాస్టార్ చిరంజీవి, విశ్వంభర ఫస్ట్ లుక్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి హైలీ యాంటిసిపేటెడ్ క్రేజీ సోషియో-ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘విశ్వంభర’ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి బిగ్ మాస్ బొనాంజాతో ముందుకు వచ్చారు.

‘When Myths Collide Legends Rise’ అనే కోట్‌తో వున్న ఈ వండర్ ఫుల్ పోస్టర్‌లో మెగాస్టార్ చిరంజీవి ఒక రాతిపై కూర్చొని, ప్రత్యేక శక్తులతో కూడిన త్రిశూలాన్ని పట్టుకుని పవర్ ఫుల్ గా కనిపించారు. మెగాస్టార్ చరిష్మాటిక్ లుక్, కొండ నుంచి ఉద్భవించిన ప్రకాశవంతమైన దైవిక శక్తి, ఉరుములు మెరపులతో కూడిన ఈ ఫస్ట్ లుక్ అదిరిపోయింది.  

చిరంజీవి త్రిశూలం వైపు ఇంటెన్స్ లుక్స్ తో చూస్తూ యూత్ ఫుల్ అండ్ డైనమిక్‌గా కనిపించారు. విజువల్‌గా అద్భుతమైన ఈ ఫస్ట్‌లుక్ స్ట్రాంగ్ బజ్‌ని క్రియేట్ చేసింది. సినిమాపై అంచనాలను పెంచింది.

తన డెబ్యు మూవీ బింబిసారతో బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు వశిష్ట తన అభిమాన హీరో చిరంజీవితో కలిసి ‘విశ్వంభర’ను అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా తీర్చిదిద్దుతున్నారు. మూవీ కోసం ఒక ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టించారు, ఇది టాప్-నాచ్ VFX, హై-ఆక్టేన్ యాక్షన్ ఎపిసోడ్‌లు, అద్భుతమైన డ్రామాతో విజువల్ వండర్‌గా ఉంటుందని హామీ ఇస్తోంది.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను బ్లాక్‌బస్టర్ ప్రొడక్షన్ హౌస్ UV క్రియేషన్స్ నిర్మిస్తోంది, ఇందులో ప్రముఖ తారాగణం, టాప్ క్లాస్ సాంకేతిక నిపుణుల పని చేస్తున్నారు. త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్ నటిస్తుండగా, కునాల్ కపూర్ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు.

విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్‌ని చాలా గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, ప్రముఖ డీవోపీ చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్.

విశ్వంభర 2025 జనవరి 10న విడుదల కానుంది.

తారాగణం: మెగాస్టార్ చిరంజీవి, త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్

సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: వశిష్ట

నిర్మాతలు: విక్రమ్, వంశీ, ప్రమోద్

బ్యానర్: యువి క్రియేషన్స్

సంగీతం: ఎంఎం కీరవాణి

డీవోపీ: చోటా కె నాయుడు

ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్

పీఆర్వో: వంశీ-శేఖర్

మార్కెటింగ్: ఫస్ట్ షో

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

7 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

7 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

7 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago