కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన తన ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై “సమ్మర్ హాలిడేస్” అనే చిల్డ్రన్ మూవీని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. “సమ్మర్ హాలిడేస్” సినిమాను మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే “సమ్మర్ హాలిడేస్” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ చిత్ర టీజర్ లాంఛ్ ఈవెంట్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిథిగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ – ఇటీవల కాలంలో ఇంత సందడిగా మరే సినిమా ఈవెంట్ జరగలేదు. ధీరజ్ వంశీ పైడిపల్లి కజిన్. రెస్టారెంట్ బిజినెస్ రన్ చేసేవాడు. ఒక సందర్భంలో సినిమా ఇండస్ట్రీకి రావాలనే తన ఆలోచన నాతో షేర్ చేసుకున్నాడు. రెస్టారెంట్ బిజినెస్ లో బాగున్నావు కదా సినిమా ఇండస్ట్రీ రిస్క్ అని చెప్పాను. అయినా పట్టుదలగా ఇండస్ట్రీకి వచ్చాడు ధీరజ్..తనదైన దారి వేసుకుంటూ ఈ రోజు హిట్స్ మీద హిట్స్ అందుకున్నాడు. మనకు చిల్డ్రన్ ఫిలిం వచ్చి చాలా కాలమవుతోంది. పిల్లలతో చేసిన ఈ సినిమా ఈ సమ్మర్ లో అందరినీ ఎంటర్ టైన్ చేయాలి, ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాకు రావాలని కోరుకుంటున్నా. ధీరజ్ తో పాటు ఈ సినిమా చేసిన గిరికి కూడా ఆల్ ది బెస్ట్. ఇవాళ ఇండస్ట్రీ బ్యాడ్ పొజిషన్ లో ఉంది. కొత్త దర్శకులు చాలా మంది ఈ ఈవెంట్ కు వచ్చారు. చిన్న చిత్రాలతో వారు సాధిస్తున్న విజయాలు ఇండస్ట్రీకి బలంగా నిలబడుతున్నాయి. వాళ్లు చిన్న చిత్రాలతో మరిన్ని విజయాలు సాధించాలి, ఇండస్ట్రీ పచ్చగా ఉండేలా చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.
రైటర్ కొండల్ రావు మాట్లాడుతూ – నేను గతంలో కమిటీ కుర్రాళ్లు చిత్రానికి రైటింగ్ టీమ్ లో ఉన్నాను. ఇప్పుడు ఈ మూవీకి రచన చేశాను. మన లైఫ్ లో అమ్మమ్మ వాళ్లింటికి వెళ్లడం, ఒక్కడ ఒక మంచి ఫ్రెండ్ తో స్నేహం చేయడం తప్పకుండా జరిగి ఉంటుంది. అలాంటి చిన్ననాటి జ్ఞాపకాలతో ఫన్, ఫెంటాస్టిక్, ఎమోషన్ ఈ మూడు ఆకట్టుకుంటాయి. మా మూవీ టీజర్ ఎంత బాగా నచ్చిందో, సినిమా కూడా అలాగే మీరు ఇష్టపడేలా ఉంటుంది. అన్నారు.
ఎడిటర్ సంతోష్ నాయుడు మాట్లాడుతూ – ఈ చిత్రాన్ని ధీరజ్ గారు ఎంతో ప్యాషనేట్ గా రూపొందించారు. పిల్లలంతా బాగా నటించారు. ప్రతి విజువల్ మీకు నాస్టాల్జిక్ మూవ్ మెంట్స్ గుర్తుచేస్తుంది. మా డైరెక్టర్ శ్రీకర్ అందరికీ నచ్చేలా సినిమా రూపొందించారు. మీలాగే నేను కూడా ఈ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నా. అన్నారు.
లిరిసిస్ట్ కిట్టు విస్సుప్రగడ మాట్లాడుతూ – ఈ కథ పూర్తిగా చదివాకే పాటలు రాశాను. గతంలో లిటిల్ హార్ట్స్ మూవీకి కూడా అలాగే స్క్రిప్ట్ మొత్తం చదివి పాటలు రాశాను. ఈ సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశం దక్కడం సంతోషంగా ఉంది. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ యెర్రమల్లి మాట్లాడుతూ – సమ్మర్ హాలిడేస్ మూవీ నాకు చాలా స్పెషల్ ఫిలిం. ఈ చిత్రానికి వర్క్ చేసే అవకాశం ఇచ్చిన ధీరజ్ గారికి థ్యాంక్స్. డైరెక్టర్ శ్రీకర్ చాలా స్పిరిచువల్ సెంటిమెంట్స్ ఫాలో అవుతాడు. కిట్టు అన్ని సాంగ్స్ కు మంచి సాహిత్యాన్ని అందించాడు. మొత్తం ఐదు సాంగ్స్ ఉంటాయి. ఈ సినిమా వర్క్ చేయడాన్ని బాగా ఎంజాయ్ చేశాను. అన్నారు.
బాలనటి ఖుషి మాట్లాడుతూ – సమ్మర్ హాలిడేస్ చిత్రంలో నటించడం హ్యాపీగా ఉంది. ఈ అవకాశం కల్పించిన నిర్మాత ధీరజ్ గారికి థ్యాంక్స్. అన్నారు
బాల నటుడు అరుణ్ మాట్లాడుతూ – సమ్మర్ హాలిడేస్ అంటే అమ్మమ్మ ఇంటికి వెళ్లడం, అక్కడ ఆటపాటలు ఆడటం, మామిడిపళ్లు తినడం ఇలా ఆ ఎంజాయ్ మెంటే వేరు. చిన్న పిల్లల సినిమాకు ఏం వెళ్తాంలే అని కొందరు అనుకోవచ్చు. కానీ పిల్లల సినిమా చూసినప్పుడు మీ చిన్నతనంలోని జ్ఞాపకాలు, చేసిన పనులన్నీ గుర్తుకు వస్తాయి. మీ అందరికీ ఈ సినిమా బాగా నచ్చుతుందని అనుకుంటున్నా. అన్నారు.
బాల నటుడు రోహన్ మాట్లాడుతూ – 90’s వెబ్ సిరీస్ తర్వాత ప్రీ వెడ్డింగ్ షో, భర్త మహాశయులకు విజ్ఞప్తి వంటి చిత్రాల్లో నటించాను. ఈ సినిమాల్లో నవ్వించే క్యారెక్టర్స్ చేశాను. ఇక ఇలాంటి పాత్రలే వస్తాయా అని భయపడ్డాను. ఆ టైమ్ లో సమ్మర్ హాలీడేస్ అనే మూవీ నాకు వచ్చింది. ఇలా సినిమా పోస్టర్ మీద సోలో ఫోటో చూసుకోవాలనేది నా డ్రీమ్. ఈ ఈవెంట్ కు దిల్ రాజు గారు గెస్ట్ గా రావడం మరో గుర్తుండిపోయే విషయం. ఈ సినిమాలో అవకాశం కల్పించిన ధీరజ్ గారికి థ్యాంక్స్. సింజిత్ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. శ్రీకర్ గారు ఈ సినిమాలో నన్ను కొత్తగా చూపించారు. నేను ఈ మూవీ కోసం సాధ్యమైనంత కష్టపడ్డాను. మీరంతా మా చిత్రాన్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
నటి హర్షిణి మాట్లాడుతూ – మా ఈవెంట్ కు ఇంతమంది టాలెంటెడ్ డైరెక్టర్స్ అతిథులుగా రావడం సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో నా క్యారెక్టర్ సర్ ప్రైజింగ్ గా ఉందని అందరూ చెబుతున్నారు. కొందరు ప్రముఖులు కూడా ఈ మూవీ చూసి అదే మాట చెప్పారు. నా క్యారెక్టర్ నెగిటవా పాజిటివా అనేది మీరే సినిమా చూసి చెప్పాలి. అన్నారు.
నటుడు రాజీవ్ కనకాల మాట్లాడుతూ – ఈ చిత్రంలో నేను ఒక మంచి క్యారెక్టర్ లో నటించాను. తూర్పు గోదావరి జిల్లా యాసలో నా క్యారెక్టర్ ఉంటుంది. ఈ పాత్రలో పర్పెక్ట్ గా మాట్లాడేందుకు మా రైటర్ కొండల్ రావు సపోర్ట్ చేశారు. శ్రీకర్ చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. బాలనటీనటులు రోహన్, అరుణ్, ఖుషి ఈ సినిమాలో అద్భుతంగా పర్ ఫార్మ్ చేశారు. వారికి ఈ సినిమాతో మరింత మంచి గుర్తింపు వస్తుంది. హర్షిణి పాత్ర సర్ ప్రైజింగ్ గా ఉంటుంది. అలాగే వాసుకి, హర్షవర్థన్ మంచి క్యారెక్టర్స్ చేశారు. సింజిత్ ఈ సినిమాకు బ్యూటిఫుల్ మ్యూజిక్ అందించారు. అన్నారు.
నటి వాసుకి మాట్లాడుతూ – స్ట్రాంగ్ స్క్రిప్ట్ తో వస్తున్న చిత్రమిది. కంటెంట్ ఈజ్ కింగ్ అన్నట్లు మా మూవీ టీజర్ చూస్తుంటేనే మీకు అర్థమై ఉంటుంది. జీవితంలోని చిన్న చిన్న సందర్భాలు, విషయాలను బ్యూటిఫుల్ గా తెరకెక్కించిన చిత్రమిది. మనందరం ఈ చిత్ర కథతో, సన్నివేశాలతో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాం. మా డైరెక్టర్ శ్రీకర్ చాలా క్లారిటీగా ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇలాంటి మంచి చిత్రంలో భాగమయ్యేలా చేసిన ధీరజ్ గారికి థ్యాంక్స్. అలాగే ఈ వేదిక మీద ఉన్న డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ గారికి థ్యాంక్స్. నాకు వుమెన్, చిల్డ్రన్ ఫిలింస్ అంటే ఇష్టం. వుమెన్, చిల్ర్డన్ గురించి మరిన్ని మూవీస్ రావాలి. అన్నారు.
డైరెక్టర్ శ్రీకర్ మాట్లాడుతూ – ధీరజ్ గారు ఇచ్చిన సపోర్ట్ వల్లే ఈ సినిమాను బాగా చేయగలిగాను. నాకు స్క్రిప్ట్ మీద ఉన్న నమ్మకంతో పాటు ధీరజ్ గారు ఉన్నారనే ధైర్యం ముందుకు నడిపించింది. ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా ఆ క్రెడిట్ ధీరజ్ గారికే వెళ్తుంది. రోహన్ ను మా సినిమాలో కొత్తగా చూస్తారు. అలాగే అరుణ్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్. ఖుషి ఫ్యూచర్ లో స్టార్ హీరోయిన్ అవుతుంది. ఈ కథ అనుకున్నప్పుడే వాసుకి గారిని అనుకున్నాం. ఆమె ప్రతి సీన్ లో బాగా నటించారు. రాజీవ్ కనకాల గారు, హర్షిణి..వీళ్లంతా తమ పర్ ఫార్మెన్స్ తో మూవీకి స్ట్రెంత్ గా నిలిచారు. సింజిత్ మ్యూజిక్, సాయి ప్రకాష్ డీవోపీ వర్క్, కిట్టు సాహిత్యం మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. మా టీమ్ అందరికీ థ్యాంక్స్. అన్నారు.
ప్రొడ్యూసర్ గిరిబాబు మాట్లాడుతూ – నేను ధీరజ్ మంచి ఫ్రెండ్స్. దేవర, డాకూ మహరాజ్ వంటి మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేశాం. ఒకరోజు ధీరజ్ ఆఫీస్ కు పిలిచి సమ్మర్ హాలిడేస్ కథ వినమన్నారు. విన్నాక చాలా బాగుంది ఈ సినిమా చేద్దామని ముందుకొచ్చాను. సినిమా బాగా వచ్చింది. మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాం. అన్నారు.
డైరెక్టర్ కౌషిక్ మాట్లాడుతూ – సమ్మర్ హాలీడేస్ వెరీ గుడ్ ఫిలిం. ఇలాంటి సినిమాను మరో నిర్మాత అయితే చేసేవారు కాదేమో. ధీరజ్ తన ప్యాషన్ తో ఈ సినిమాను నిర్మించాడు. మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే చిత్రమిది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ ది బెస్ట్ ఇచ్చారు. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.
డైరెక్టర్ నందకిషోర్ మాట్లాడుతూ – సమ్మర్ హాలిడేస్ మూవీ చేస్తున్నప్పుడు ధీరజ్ గారు నాతో మాట్లాడారు. మా 35 ఇది చిన్న కథ కాదు సినిమా చూశాక తనలో కాన్ఫిడెన్స్ మరింత పెరిగిందని ధీరజ్ గారు చెప్పడం హ్యాపీగా అనిపించింది. ఈ సమ్మర్ హాలీడేస్ సినిమా థియేటర్స్ లో కూల్ గా ఉంటుంది. మీ బాల్యాన్ని గుర్తు చేస్తుంది. మీ పిల్లల అల్లరిని చూసినట్లు అనిపిస్తుంది. అన్నారు.
డైరెక్టర్ రవి నంబూరి మాట్లాడుతూ – డైరెక్టర్ శ్రీకర్ కథ బ్యూటిఫుల్ గా చెప్తాడు. ఈ సినిమా కథ వింటూ నా మెమొరీస్ లోకి వెళ్లిపోయాను. నా మిత్రులు కొందరు ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. సమ్మర్ హాలిడేస్ ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంది. అన్నారు.
డైరెక్టర్ సాయి మార్తాండ్ మాట్లాడుతూ – ధీరజ్ గారు నిర్మించిన సినిమాలన్నీ బాగుంటాయి. ఇది పిల్లల సినిమా అయినా ధీరజ్ గారు మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో చాలా బాగా నిర్మించారు. ఈ సినిమా పక్కాగా హిట్ అవుతుందని చెప్పగలను. సింజిత్ కంపోజ్ చేసిన సాంగ్ విన్నాను. చాలా బాగుంది. అన్నారు
డైరెక్టర్ రామ్ అబ్బరాజు మాట్లాడుతూ – ఈ టీమ్ అంతా తెలిసినవాళ్లే. ఈ వేదిక మీద మాట్లాడుతుంటే కజిన్స్ తో సమ్మర్ హాలీడేస్ లో ఉన్నట్లుంది. టీజర్ బ్యూటిఫుల్ గా ఉంది. చూస్తుంటే ఫ్రెష్ ఫీల్ కలిగింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.
డైరెక్టర్ పవన్ సాధినేని మాట్లాడుతూ – టీజర్ చూడగానే ఈ సినిమా థియేటర్స్ లో చూడాలి అనుకుంటే ఆ మూవీ సూపర్ హిట్ అయినట్లే. సమ్మర్ హాలిడేస్ టీజర్ చూస్తుంటే తప్పకుండా థియేటర్స్ లో చూడాలని ఫీల్ కలిగింది. ధీరజ్ ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాడు. ఈ సినిమా హిట్ అనే నమ్మకం ఏర్పడింది. ఎంతోమంది న్యూ టాలెంట్ ఈ చిత్రంతో పరిచయం కావడం అభినందనీయం. అన్నారు.
డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ – నాకు ఇద్దరు ట్విన్స్ ఉన్నారు. వాళ్లకు ఏవైనా పిల్లల సినిమాలు చూపిద్దామంటే డిస్నీ, పిక్సార్ తప్ప మరో మూవీస్ లేవు. ఇప్పుడు తెలుగులో పిల్లల సినిమాలు లేవు. మా చిన్నతనంలో కనీసం ఏడాదికో చిన్న సినిమా వచ్చేది. చాలా రోజుల తర్వాత తెలుగులో పిల్లల కోసం ఒక సినిమా వస్తున్నందుకు తండ్రిగా హ్యాపీగా ఫీలవుతున్నా. ధీరజ్ స్టార్స్ తో కాకుండా ఒక కథను నమ్మి ఈ సినిమా చేస్తున్నాడు. ఆయన్ను సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనందరిదీ. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.
డైరెక్టర్ సాయి రాజేశ్ మాట్లాడుతూ – సినిమా ఇండస్ట్రీలో రెండేళ్ల క్రితం ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. ఏ కంటెంట్ జెన్యూన్ గా ఆడియెన్స్ కు రీచ్ అవుతుందో, ఏ సినిమాకు ఓపెనింగ్స్ వస్తాయో రావో తెలియని పరిస్థితి నెలకొంది. మా చెన్నై లవ్ స్టోరీ సినిమా సాంగ్ రీసెంట్ గా రిలీజ్ చేశాం. ఆ పాటకు రెస్పాన్స్ ఎలా ఉంది, ఆడియెన్స్ ఫీడ్ బ్యాక్ ఏంటి అనేది టెన్షన్ గానే ఉంది. సినిమా మీద పెద్ద బడ్జెట్స్ పెడుతున్నాం. డైరెక్టర్స్ గా మేము ఎలాంటి కథలు రాయాలి అనేది సందిగ్ధంలో ఉన్నాం. బేబి సినిమా ఇప్పుడు రిలీజై ఉంటే సగం షేర్ కూడా వచ్చేది కాదు. మనం కొన్ని జానర్ మూవీస్ ను చంపేశాం. రోమ్ కామ్, థ్రిల్లర్, యాక్షన్ మూవీస్..ఇలా కొన్ని జానర్స్ మాత్రమే చేస్తున్నాం. మంచి కథల్ని నమ్మి ప్యాషనేట్ గా సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్న గట్స్ ఉన్న ప్రొడ్యూసర్ ధీరజ్ కు థ్యాంక్స్. ప్రేక్షకుల్లో సినిమా ఇండస్ట్రీ మీద, సినిమాల మీద మళ్లీ గౌరవం కలిగించాలి. గిరిగారు మంచి వ్యక్తి. ఆయనకు ఈ సినిమాతో మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నా. ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.
ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ – మా మూవీ టీజర్ లాంఛ్ చేసిన దిల్ రాజు గారికి థ్యాంక్స్. నేను ఇండస్ట్రీలోకి వచ్చేందుకు అరవింద్ గారు కారణం. ఆయనతో కలిసి గత నాలుగు చిత్రాలు చేశాను. సోలోగా ఇప్పుడు మూవీ చేస్తున్నా. ఆయన బ్లెస్సింగ్స్ నాకు ఉంటాయి. ఈ కథ గత డిసెంబర్ లోనే విన్నాను. ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ చేశాం. సమ్మర్ కు ఎలాగైనా రిలీజ్ చేయాలని అనుకున్నాం. కానీ బెటర్ మెంట్స్ , ఇతర అనుకోని కారణాల వల్ల రిలీజ్ చేయలేకపోతున్నాం. రిలీజ్ ఆలస్యమవుతున్నా సూపర్బ్ కంటెంట్ తో వస్తున్నామనే గర్వంగా సంతోషంగా ఉన్నాను. ఈ ప్రాజెక్ట్ గురించి చెబితే కొందరు పిల్లల సినిమా ఎవరు చూస్తారని నిరుత్సాహపరిచారు. నేను చిన్నప్పుడు లిటిల్ సోల్జర్స్ లాంటి మూవీ చూసి ఎంజాయ్ చేశాను. ఇలాంటి జానర్ లో ఏడాదికి ఒక సినిమా వచ్చినా పిల్లలు, ఫ్యామిలీస్ థియేటర్స్ కు వెళ్లి ఎంజాయ్ చేస్తారని నమ్మాను. నా టీమ్ అంతా సినిమా కోసం కష్టపడుతున్నారు. లక్కీగా ఈ కథకు కావాల్సిన ముగ్గురు మంచి పర్ ఫార్మర్స్, పిల్లలు దొరికారు. వాళ్లతో పాటు వాళ్ల పేరెంట్స్ కు థ్యాంక్స్ చెబుతున్నా. ఈ చిత్రంలో అమ్మమ్మ క్యారెక్టర్ చేస్తున్న జయసుధ గారికి, కీ రోల్స్ చేస్తున్న వాసుకి, హర్షవర్థన్, రాజీవ్ కనకాల, హర్షిణి గారికి థ్యాంక్స్. ఇలాంటి మూవీ సక్సెస్ అయితే మరో నలుగురు ప్రొడ్యూసర్స్ ఈ జానర్ మూవీస్ చేస్తారు. నా స్నేహితుడు గిరి ఈ కథ వినగానే నా మీద నమ్మకంతో ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకొచ్చాడు. రీసెంట్ గా డిఫ్యూటీ సీఎం కల్యాణ్ గారిని పెద్ద ప్రొడ్యూసర్స్ వెళ్లి కలిశారు. పెద్ద ప్రొడ్యూసర్స్ కు సమస్యలు ఉన్నట్లే మా చిన్న నిర్మాతలకు కూడా సమస్యలు ఉన్నాయి. సందర్భం వచ్చినప్పుడు మేమూ వెళ్లి పవన్ కల్యాణ్ గారిని కలిసి వివరిస్తాం. పైరసీ అరికట్టేందుకు పవన్ కల్యాణ్ గారి సహకారంతో కేంద్రమంత్రి అమిత్ షా గారిని కలవబోతున్నాం. అన్నారు.
నటీనటులు – రోహన్ రాయ్, అరుణ్, ఖుషి, రాజీవ్ కనకాల, వాసుకి, హర్షిణి, హర్షవర్థన్, తదితరులు
డీవోపీ – సాయి ప్రకాశ్
మ్యూజిక్ డైరెక్టర్ – సింజిత్ యెర్రమల్లి
బ్యానర్ – ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
ప్రొడ్యూసర్ – ధీరజ్ మొగిలినేని
స్టోరీ, డైరెక్టర్ – శ్రీకర్
v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…