‘ఛాంగురే బంగారురాజా’ సెప్టెంబర్ 15న విడుదల

రవితేజ ఆర్టీ టీమ్‌వర్క్స్, ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్, సతీష్ వర్మ ‘ఛాంగురే బంగారురాజా’ సెప్టెంబర్ 15న విడుదల

మాస్ మహారాజా రవితేజ ప్రొడక్షన్ బ్యానర్ ఆర్‌టి టీమ్‌వర్క్స్ మరో కాన్సెప్ట్ బేస్డ్ చిత్రం ‘ఛాంగురే బంగారురాజా’ తో రాబోతోంది. సతీష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్‌తో కలిసి రవితేజ నిర్మిస్తున్నారు. శ్వేత కాకర్లపూడి, షాలిని నంబు ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రోడ్యూసర్స్. ఈరోజు సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేశారు.

సెప్టెంబర్ 15న వినాయక చవితి సందర్భంగా ‘ఛాంగురే బంగారురాజా’ ప్రేక్షకుల ముందుకు రానుంది. పండగ సెలవు సినిమాకి బాక్సాఫీస్ దగ్గర ఫేవర్ కానుంది. ప్రధాన తారాగణంతో కూడిన రిలీజ్ డేట్ పోస్టర్ హ్యుమరస్ గా ఆసక్తిని రేకెత్తిస్తుంది.

‘C/o కంచరపాలెం’, ‘నారప్ప’ ఫేమ్ కార్తీక్ రత్నం హీరోగా నటిస్తుండగా, గోల్డీ నిస్సీ హీరోయిన్. రవిబాబు, సత్య ఈ చిత్రంలో ఇతర ప్రధాన తారాగణం. మేకర్స్ ఇదివరకే ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేసారు. ఇది ప్రధాన పాత్రలు,  కథాంశాన్ని పరిచయం చేసింది. టీజర్‌కి చాలా మంచి స్పందన వచ్చింది.

కృష్ణ సౌరభ్ సంగీతం సమకూరుస్తుండగా, సుందర్ ఎన్‌సి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జనార్ధన్ పసుమర్తి డైలాగ్స్ రాసిన ఈ చిత్రానికి కార్తీక్ వున్నవా ఎడిటర్.

త్వరలో ‘ఛాంగురే బంగారురాజా’ ట్రైలర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

నటీనటులు: కార్తీక్ రత్నం, సత్య, రవిబాబు, గోల్డీ నిస్సీ, నిత్య శ్రీ, ఎస్తర్ నోరోన్హా, అజయ్ తదితరులు

సాంకేతిక విభాగం:
నిర్మాత: రవితేజ
బ్యానర్: RT టీమ్‌వర్క్స్, ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్‌
రచన, దర్శకత్వం:  సతీష్ వర్మ
క్రియేటివ్ ప్రోడ్యూసర్స్: శ్వేత కాకర్లపూడి, షాలిని నంబు
సంగీతం: కృష్ణ సౌరభ్
డీవోపీ: సుందర్ NC
ఎడిటర్: కార్తీక్ వున్నవా
ఆర్ట్: నార్ని శ్రీనివాస్
డైలాగ్స్: జనార్దన్ పసుమర్తి
పీఆర్వో: వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago