పవర్‌ఫుల్‌ పోలీస్‌ఆఫీసర్‌గా చాందిని చౌదరి నటిస్తున్న యేవమ్‌ లుక్‌ విడుదల

కథానాయిక చాందిని చౌదరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘యేవమ్‌’. వశిష్ట సింహా, జైభారత్‌, ఆషురెడ్డి ముఖ్యతారలుగా రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రకాష్‌ దంతులూరి దర్శకుడు. నవదీప్‌, పవన్‌ గోపరాజు నిర్మాతలు. శుక్రవారం ఈ చిత్రంలో చాందిని చౌదరి నటిస్తున్న పాత్రకు సంబంధించిన లుక్‌ను విడుదల చేశారు మేకర్స్‌.

మహిళా సాధికారికతను చాటి చెప్పే విధంగా ఆమె పాత్ర చిత్రంలో కనిపించనుంది. దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ ‘ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లో కనిపించినట్లుగా చాందిని చౌదరి పాత్ర ‘ఆడపిల్లని అయితే ఏంటంటా? ‘ అనే విధంగా, నేటి మహిళా సాధికారితను, ధైర్యాన్ని రిప్రంజెట్‌ చేసే విధంగా వుంటుంది. ఈ చిత్రంలో చాందిని చౌదరి నటన ఎంతో హైలైట్‌గా వుంటుంది. కొత్త కంటెంట్‌తో పాటు ఎంతో డిఫరెంట్‌ నేరేషన్‌తో ఈ సినిమా వుంటుంది. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకం వుంది’ అన్నారు. చాందిని చౌదరి, వశిష్ట సింహా, జైభారత్‌, ఆషురెడ్డి, గోపరాజు రమణ, దేవిప్రసాద్‌, కల్పిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌క్ష్మ ఎస్‌వీ విశ్వేశ్వర్‌, సంగీతం కీర్తన శేషు, నీలేష్‌ మందలపు అందిస్తున్నారు. సుజనా అడుసుమిల్లి ఎడిటర్‌గా, రాజు పెన్మెత్స ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

7 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

7 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

7 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago