‘చాయ్ వాలా’ ఫస్ట్ లుక్ .. త్వరలో టీజర్ విడుదల

యంగ్, ప్రామిసింగ్ యాక్టర్ శివ కందుకూరి ఎప్పుడూ కూడా డిఫరెంట్ స్టోరీలతో ప్రయోగాలు చేస్తుంటారు. ఎంతో వైవిధ్యాన్ని ప్రదర్శించేందుకు వీలున్న కథల్ని మాత్రమే ఎంచుకుంటూ ఉంటారు. ఇలాంటి తరుణంలో శివ కందుకూరి హీరోగా ‘#చాయ్ వాలా’ అనే చిత్రాన్ని హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రాధా విజయలక్ష్మి, వెంకట్ ఆర్. పాపుడిప్పు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రమోద్ హర్ష రచన, దర్శకత్వం వహించారు.

‘#చాయ్ వాలా’ నుంచి శుక్రవారం (ఆగస్ట్ 8) నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో శివ కందుకూరి, రాజీవ్ కనకాల స్కూటీపై అలా జాలీగా తిరుగుతూ కనిపిస్తున్నారు. చూస్తుంటే అది హైదరాబాద్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించినట్టుగా కనిపిస్తోంది. ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో వారిద్దరి నవ్వుల్ని చూస్తుంటే ఆడియెన్స్‌ ఇట్టే కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది.

‘ఈ కథ ప్రేమ, వారసత్వం అనే అంశాల చుట్టూ తిరుగుతుంది. ఓ పర్ఫెక్ట్ చాయ్, కప్పులా ఉంటుంది. భావోద్వేగాలు, సంప్రదాయం, కలలతో నిండిన అద్భుతమైన ప్రయాణాన్ని చూసేందుకు సిద్ధంగా ఉండండి. టీజర్ అతి త్వరలో వస్తుంది’ అంటూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

ఈ మూవీకి ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం సమకూరుస్తుండగా, క్రాంతి వర్ల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. పవన్ నర్వా ఈ చిత్రానికి ఎడిటర్‌గా పని చేస్తున్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

13 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

13 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

14 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago