ప్రామిసింగ్ హీరో శివ కందుకూరి హీరోగా హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న సెన్సిబుల్ లవ్‌స్టోరీ ‘చాయ్ వాలా’ నుంచి తొలి పాట ‘సఖిరే..’ విడుదల
వైవిధ్యమైన సినిమాలతో తనదైన గుర్తింపు సంపాదించుకున్న యంగ్, ప్రామిసింగ్ యాక్టర్ శివ కందుకూరి హీరోగా ‘చాయ్ వాలా’ అనే చిత్రాన్ని హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రాధా విజయలక్ష్మి, వెంకట్ ఆర్. పాపుడిప్పు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రమోద్ హర్ష రచన, దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్, టీజర్‌లకు ప్రేక్షకుల నుంచి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో మేకర్స్ గురువారం రోజున తొలి పాటను విడుదల చేశారు. ‘సఖిరే..’ అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ హృదయాలను హత్తుకుంటోంది. క్యాచీ ట్యూన్‌తో మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ ఆర్.విహారి ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశారు. సురేష్ బనిశెట్టి రాసిన ఈ పాటను కపిల్ కపిలన్ పాడారు. ప్రేయసిపై గుండెలనిండా స్వచ్చమైన ప్రేమను నింపుకున్న హీరో తన భావాలను అందంగా ఈ పాట రూపంలో వ్యక్తం చేస్తున్నారు.
హీరో శివ కందుకూరి స్టన్నింగ్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్నారు. హీరోయిన్ తేజు అశ్విని బ్యూటీతో చూపులు తిప్పుకోనీయటం లేదు. ఈ మెలోడీలో రొమాంటిక్ మూమెంట్స్ విజువల్ ట్రీట్‌లా ఉంది. పాట అందరూ పాడుకునేలా ఉంది. కపిల్ కపిలన్ గొంతు నుంచి వచ్చిన ఈ పాట మరింత మాధుర్యంగా అనిపిస్తోంది. ప్రేమించేవాళ్లకు, మ్యూజిక్ లవర్స్‌కు ఈ పాట బాగా కనెక్ట్ అవుతుంది.
ప్రమోద్ హర్ష దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ప్రశాంత్ ఆర్.విహారి సంగీతాన్ని అందిస్తున్నారు. క్రాంతి వర్ల సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి పవన్ నర్వ ఎడిటర్
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…