నార్నే నితిన్ హీరోగా వచ్చిన ఆయ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అంజి కె. మణిపుత్ర దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో నయన్ సారిక హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రాన్ని బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో ఆగస్టు 15న విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది
గోదావరి ప్రాంత నేపథ్యంలో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఆడియెన్స్, విమర్శకుల నుండి ప్రశంసలతో పాటు, మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తండేల్ టీమ్ ఆయ్ యూనిట్‌ను అభినందించారు.
ఈ చిత్రం ఇప్పటికీ మంచి ఆక్యుపెన్సీ, డీసెంట్ కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఈరోజు నుండి వారాంతానికి వచ్చే ఆయ్ కలెక్షన్లలో నిర్మాత వాటాలో 25% జనసేన పార్టీ ద్వారా వరద బాధితులకు అందజేస్తామని నిర్మాత బన్నీ వాస్, గీతా ఆర్ట్స్ ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆ ప్రాంతమంతా అల్లకల్లోలం అయిన సంగతి తెలిసిందే. వరదల వల్ల ఎంతో మందికి నీడ లేకుండాపోయింది. ఎంతో మందికి ఆహారం అందకుండా పోతోంది. వరద బాధితులకు అండగా నిలిచేందుకు నిర్మాత బన్నీ వాస్ ముందుకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో వరదల వల్ల నష్టపోయిన వారికి సాయంగా ఆయ్ టీం నిలిచింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి ఉండే సామాజిక బాధ్యత నుంచి స్పూర్తి పొంది బన్నీ వాస్ అండ్ టీమ్ వరద బాధితులకు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చింది.
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…