ప్రముఖ సినీ గీత రచయిత పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కాంస్య విగ్రహవిష్కరణ

తానా సాహిత్య విభాగం – తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో మరియు అనకాపల్లి సిరివెన్నెల కళాపీఠం ఆధ్వర్యంలో అనకాపల్లి, గాంధీనగర్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరలో మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ గారి అధ్యక్షతన ఈరోజు ప్రముఖ సినీ గీత రచయిత పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కాంస్య విగ్రహావిష్కరణ సుప్రసిద్ధ సినీదర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చేతుల మీదగా మరియు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కుటుంబ సభ్యుల మధ్య విగ్రహ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. అనంతరం పెంటకోట కన్వెన్షన్ లో శాసనసభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ గారి అధ్యక్షతన శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మహోత్సవ సభ అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ రామకృష్ణ గారు మాట్లాడుతూ
రథసప్తమి రోజున అనకాపల్లి లో పుట్టి అనకాపల్లి లో పెరిగి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఒక సాహిత్య వేత్తగా ఒక గేయ రచయితగా అనకాపల్లి కి గౌరవాన్ని తీసుకొచ్చిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి విగ్రహ ఆవిష్కరణ ఆయన పుట్టిన ప్రాంతంలో ఆయన తిరిగి న ప్రాంతంలో గాంధీనగర్ లో ఏర్పాటు చేయడం ఆ విగ్రహ ఆవిష్కరణకు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి అల్లుడు మంచి అభిమాని అయిన ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు రావడం వారు చేతుల మీద పద్మశ్రీ అవార్డు గ్రహీత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి విగ్రహ ఆవిష్కరణ జరగడం గొప్ప విషయం అని, సిరివెన్నెల సీతారామశాస్త్రి కళాపీఠం ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఒక అవార్డు ఇవ్వాలని ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారని, ఈ ఏడాది విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కుటుంబ సభ్యులతో కలిసి పూర్తి చేయడం జరిగిందని. విగ్రహ ఏర్పాటుకు తానా ప్రపంచ సాహిత్య వేదిక వారు సహకారం అందించారని అన్నారు.

అనంతరం శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్గారిని మరియు శాస్త్రి గారి కుటుంబ సభ్యులను సత్కరించి గౌరవించారు. ఈ కార్యక్రమం సందర్భంగా విచ్చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని శాస్త్రి గారి కుటుంబాన్ని శ్రీశ్రీశ్రీ ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం వారు పూర్ణకుంభంతో స్వాగతం పలికి అమ్మవారిని దర్శింప చేసి వేద పండితులచే ఆశీర్వచనం అందించి సత్కరించి అమ్మవారి జ్ఞాపకం అందజేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

TFJA

Recent Posts

త్వ‌ర‌లోనే నితిన్ 36వ సినిమా షూటింగ్ ప్రారంభం

నితిన్ హీరోగా వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీనివాస సిల్వ‌ర్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై రూపొంద‌నున్న యూనిక్ సైఫై ఎంట‌ర్‌టైన‌ర్‌.. వైవిధ్య‌మైన సినిమాలు, పాత్ర‌ల‌తో…

3 hours ago

రికార్డులు తిరగరాస్తున్న స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి

కేవలం ఐదు రోజుల్లో రూ.100.2 కోట్ల గ్రాస్ సాధించిన 'అనగనగా ఒక రాజు'నవీన్‌ పొలిశెట్టి కెరీర్‌లోనే అతిపెద్ద విజయంయూఎస్‌లో హ్యాట్రిక్…

6 days ago

దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ చిత్రం నుంచి సాత్విక వీరవల్లి పరిచయం

వైవిధ్య‌మైన సినిమాలు, పాత్ర‌ల‌తో బ‌హు భాషా న‌టుడిగా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న స్టార్‌ దుల్క‌ర్ స‌ల్మాన్. కంటెంట్ బేస్డ్ మూవీస్…

6 days ago

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

3 weeks ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

3 weeks ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

3 weeks ago