హాస్య బ్రహ్మ, పద్మశ్రీ బ్రహ్మానందం, అతని కుమారుడు రాజా గౌతమ్ ఔట్ అండ్ ఔట్ఎంటర్‌టైనర్ ‘బ్రహ్మ ఆనందం’లో తాత, మనవళ్ళుగా అలరించబోతున్నారు. ఈ చిత్రానికి ఫస్ట్ -టైమర్ RVS నిఖిల్ దర్శకత్వం వహిస్తున్నారు. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. సావిత్రి, శ్రీ ఉమేష్ యాదవ్ సమర్పిస్తున్నారు.
మేకర్స్ మూవీ నుంచి బ్రహ్మానందం ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ లో సంప్రదాయ పంచె కట్టులో, సంతోషకరమైన చిరునవ్వుతో ఆకట్టుకున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ పాజిటివ్ ఇంప్రెషన్‌ని కలిగిస్తుంది. మేకర్స్ అనౌన్స్ చేసినట్లుగా, ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ ఆగస్ట్ 19 న విడుదల అవుతుంది.
స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్100% సక్సెస్ రేట్‌తో న్యూ ఏజ్ కంటెంట్ బేస్డ్ సినిమాలను రూపొందిస్తోంది. వారి గత చిత్రాలు మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను అందించాయి. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.
ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్స్ గా కనిపించనున్నారు. వెన్నెల కిషోర్ ఫుల్ లెంగ్త్ రోల్ పోషిస్తుండగా, సంపత్, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి శాండిల్య పిసాపాటి మ్యూజిక్ అందిస్తున్నారు. మితేష్ పర్వతనేని డీవోపీ గా పని చేస్తున్నారు. ప్రసన్న ఎడిటర్.
తారాగణం: రాజా గౌతమ్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, ప్రియా వడ్లమాని. ఐశ్వర్య హోలక్కల్, సంపత్, రాజీవ్ కనకాల
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: RVS నిఖిల్
నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా
బ్యానర్: స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్
సమర్పణ: శ్రీమతి. సావిత్రి, శ్రీ ఉమేష్ యాదవ్
DOP: మితేష్ పర్వతనేని
సంగీతం: శాండిల్య పీసపాటి
ఎడిటర్: ప్రసన్న
ఆర్ట్ డైరెక్టర్: క్రాంతి ప్రియం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పి దయాకర్ రావు
పీఆర్వో : వంశీ శేఖర్
పబ్లిసిటీ డిజైన్స్: మాయాబజార్
మార్కెటింగ్: ఫస్ట్ షో
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…