పద్మశ్రీ’ బ్రహ్మానందం, రాజా గౌతమ్, వెన్నెల కిషోర్ ‘బ్రహ్మ ఆనందం’ మోస్ట్ ఎంటర్‌టైనింగ్ గ్లింప్స్ విడుదల,

హాస్య బ్రహ్మ, పద్మశ్రీ బ్రహ్మానందం, అతని కుమారుడు రాజా గౌతమ్ ఔట్ అండ్ ఔట్ఎంటర్‌టైనర్ ‘బ్రహ్మ ఆనందం’లో తాత, మనవళ్ళుగా అలరించబోతున్నారు. ఫస్ట్-టైమర్ RVS నిఖిల్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. సావిత్రి, శ్రీ ఉమేష్ యాదవ్ సమర్పిస్తున్నారు.

ఇటీవల మేకర్స్  బ్రాహ్మ ఆనందం ఫస్ట్ లుక్‌ను రిలిన్ చేశారు. బ్రహ్మానందం ట్రెడిషనల్ అవతార్‌లో కనిపించిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు, రక్షా బంధన్‌ను పురస్కరించుకుని, మేకర్స్ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ని విడుదల చేశారు.

రాజా గౌతమ్ పరిచయంతో గ్లింప్స్ స్టార్ట్ అవుతుంది. అవసరాలు తీర్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్న హోప్ లెస్ యువకుడిగా రాజా గౌతమ్ కనిపించిన తీరు ఆసక్తికరంగా వుంది. వెన్నెల కిషోర్ అతని స్నేహితుడిగా కనిపించారు. తను లైఫ్ లో ప్రోగ్రస్ లేని డాక్టర్.

అన్ని సమస్యలు, పరిష్కారాల అల్టిమేట్ “బాప్” గా బ్రహ్మానందం గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. దీంతో డ్రామా మరింత ఆసక్తికరంగా మారింది. ఇది హోలమ్స్ ఎంటర్‌టైనర్ అని గ్లింప్స్ ద్వారా స్పష్టమవుతుంది. మూడు పాత్రలను హిలేరియస్ గా డిజైన్ చేశారు.  

స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్100% సక్సెస్ రేట్‌తో న్యూ ఏజ్ కంటెంట్ బేస్డ్ సినిమాలను రూపొందిస్తోంది. వారి గత చిత్రాలు మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను అందించాయి. ‘బ్రహ్మా ఆనందం’ మరో యూనిక్ ఎంటర్ టైనర్ కానుంది.  

ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్స్ గా కనిపించనున్నారు. వెన్నెల కిషోర్ ఫుల్ లెంగ్త్ రోల్ పోషిస్తుండగా, సంపత్, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి శాండిల్య పిసాపాటి మ్యూజిక్ అందిస్తున్నారు.  మితేష్ పర్వతనేని డీవోపీ గా పని చేస్తున్నారు. ప్రసన్న ఎడిటర్.

డిసెంబర్ 6న బ్రహ్మ ఆనందం విడుదల కానుందని మేకర్స్ అనౌన్స్ చేశారు

తారాగణం: రాజా గౌతమ్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, ప్రియా వడ్లమాని. ఐశ్వర్య హోలక్కల్, సంపత్, రాజీవ్ కనకాల

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: RVS నిఖిల్
నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా
బ్యానర్: స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్
సమర్పణ: శ్రీమతి. సావిత్రి, శ్రీ ఉమేష్ యాదవ్
DOP: మితేష్ పర్వతనేని
సంగీతం: శాండిల్య పీసపాటి
ఎడిటర్: ప్రసన్న
ఆర్ట్ డైరెక్టర్: క్రాంతి ప్రియం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పి దయాకర్ రావు
పీఆర్వో : వంశీ శేఖర్
పబ్లిసిటీ డిజైన్స్: మాయాబజార్
మార్కెటింగ్: ఫస్ట్ షో

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

6 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

6 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

7 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago