5 రోజుల్లో రాబోతున్న బ్లాక్ బస్టర్ మూవీ ‘మై బేబి’

Must Read

తమిళంలో ఘన విజయం సాధించిన డీఎన్‌ఏ మూవీ ‘మై బేబి’ పేరుతో తెలుగులో మరో 5 రోజుల్లో రిలీజ్ కానుంది.తమిళంలో ఇటీవల విడుదలై సూపర్ హిట్ అయిన డీఎన్ఏ సినిమాను ఎస్. కె. పిక్చర్స్ ద్వారా అభిరుచి గల నిర్మాత సురేష్ కొండేటి తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ఈ సినిమా తెలుగులో ‘మై బేబి’ పేరుతో జూలై 11న విడుదల కానుంది. గతంలో ‘ప్రేమిస్తే’, ‘జర్నీ’, ‘షాపింగ్ మాల్ ‘, ‘పిజ్జా’ వంటి విజయవంతమైన 15 చిత్రాలను నిర్మాతగా విడుదల చేసిన సురేష్ కొండేటి గతంలో డిస్ట్రిబ్యూటర్‌గా 85 పైగా చిత్రాలను విడుదల చేశారు.

ఇప్పుడు నిర్మాతగా 16వ చిత్రంగా ‘మై బేబీ’ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ‘నెల్సన్ వెంకటేసన్ దర్శకత్వంలో తమిళంలో ఇటీవలే విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. హాస్పిటల్స్‌లో పిల్లల్ని మాయం చెయ్యడం, వారిని వేరే చోట అమ్మేయడం వంటి వార్తలని చూస్తుంటాం. ఇలాంటి వార్తలు ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాలుగా వింటూనే ఉన్నాం. ఈ సినిమా మరొక్కసారిగా మనం సొసైటీలో ఎంత జగ్రత్తగా ఉండాలో తెలియచేసింది. అధర్వ మురళి, నిమిషా సజయన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్, భావోద్వేగ డ్రామాతో కూడిన గ్రిప్పింగ్ కథాంశంతో ఆకట్టుకుంది. 2014లో ఒక సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్ జీవితంలో జరిగిన దుర్ఘటన నేపథ్యంలో ఈ కథ సాగుతుంది.

Latest News

హీరో సుడిగాలి సుధీర్ “సుధీర్స్ జోకర్” సినిమా నుంచి వెర్సటైల్ యాక్టర్ మురళీశర్మ బర్త్ డే పోస్టర్ రిలీజ్

-"సుధీర్స్ జోకర్" చిత్రంలో డిటెక్టివ్ జీవన్ పాత్రలో ఆకట్టుకోనున్న మురళీశర్మ సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "సుధీర్స్ జోకర్". బిగ్ బాస్ ఫేమ్ అయేషా...

More News