నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసిన కార్తికేయ గుమ్మకొండ “భజే వాయు వేగం”

Must Read

ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన “భజే వాయు వేగం” సినిమా గత నెల 31న థియేటర్స్ లో రిలీజై సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఓటీటీ లోకి వచ్చేసింది. ఈ రోజు నుంచి నెట్ ఫ్లిక్స్ లో “భజే వాయు వేగం” సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. “భజే వాయు వేగం” సినిమాను నెట్ ఫ్లిక్స్ లో చూస్తున్న ఆడియెన్స్ మూవీలో తమకు నచ్చిన సన్నివేశాల స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

“భజే వాయు వేగం” సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషించారు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. థియేటర్స్ లో మంచి సక్సెస్ అందుకున్న”భజే వాయు వేగం” నెట్ ఫ్లిక్స్ లోనూ టాప్ లో ట్రెండ్ అయ్యేలా కనిపిస్తోంది.

నటీనటులు – కార్తికేయ గుమ్మకొండ, ఐశ్వర్య మీనన్, రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ తదితరులు

టెక్నికల్ టీమ్-
మాటలు: మధు శ్రీనివాస్
ఆర్ట్: గాంధీ నడికుడికర్
ఎడిటర్: సత్య జి
సినిమాటోగ్రఫీ: ఆర్.డి రాజశేఖర్
మ్యూజిక్ (పాటలు) – రధన్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ – కపిల్ కుమార్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్-శ్రీనివాస్)
కో ప్రొడ్యూసర్ – అజయ్ కుమార్ రాజు.పి
ప్రొడ్యూసర్: యూవీ కాన్సెప్ట్స్
దర్శకుడు: ప్రశాంత్ రెడ్డి చంద్రపు

Latest News

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ థియేట‌ర్స్‌లో సంద‌డి చేస్తోన్న‌సినిమా ధనుష్, కృతి...

More News