శివకార్తికేయన్ హీరోగా, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మిస్తున్న మ్యాసీవ్ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తెలుగు, తమిళ్ లో గ్రాండ్ గా రూపొందుతున్న ఈ మూవీలో మలయాళ సూపర్ స్టార్ బిజు మీనన్ పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నట్లు మేకర్స్ తాజాగా ఎనౌన్స్ చేశారు.
ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్ లో బీజు మీనన్ జాయిన్ అయ్యారు. ఈ మేరకు మేకర్స్ విడుదల చేసిన మేకింగ్ వీడియోలో బీజు మీనన్ ప్రజెన్స్ సినిమాపై చాలా క్యూరియాసిటీ పెంచింది.
దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తన పాపులర్ స్టొరీ టెల్లింగ్ స్టయిల్, యూనిక్ సెట్టింగ్‌తో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం హై యాక్షన్-ప్యాక్డ్ ఎక్స్ పీరియన్స్ ని అందిస్తుంది.
వరుసగా బ్లాక్‌బస్టర్ హిట్‌లను అందిస్తున్న హీరో శివకార్తికేయన్ కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్, మ్యాసీవ్ మూవీ. శివకార్తికేయన్ యూనిక్, స్టైలిష్ అవతార్ లో కనిపిస్తారు.
ట్యాలెంటెడ్ కన్నడ యాక్ట్రెస్ రుక్మిణి వసంత్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రీ లక్ష్మీ మూవీస్ సంస్థ పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
సెన్సేషనల్ మ్యూజిక్ కంపోజర్ రాక్‌స్టార్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ సుదీప్ ఎలామన్ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, అరుణ్ వెంజరమూడు ఆర్ట్ డైరెక్షన్ వహిస్తున్నారు. ఈ చిత్రానికి మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ యాక్షన్ కొరియోగ్రాఫ్.
దళపతి విజయ్ చివరి సినిమా ‘జన నాయగన్’ జనవరి 9, 2026న విడుదల కాబోతోందని మేకర్లు అధికారికంగా ప్రకటించారు. ఈ…
Megastar Chiranjeevi has yesterday ( 19 March 2025 ) added another jewel to his crown……
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘జాక్ - కొంచెం క్రాక్’. వైష్ణవి…
టాలీవుడ్లో నిర్మాతగా దిల్ రాజుకి ఉన్న బ్రాండ్ అందరికీ తెలిసిందే. దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి ఓ సినిమా వస్తుందంటే…
ఖురేషి అబ్రామ్ యొక్క చీకటి ప్రపంచంలోకి అడుగు పెట్టండి: మార్చి 20న మలయాళ సూపర్‌స్టార్, కంప్లీట్‌యాక్టర్ మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్…
American actor Kyle Paul took to his social media to share his thoughts about starring…