ఆవారా జిందగి.. లో ప్రధాన పాత్రగా బిగ్ బాస్ శ్రీహాన్

Must Read

ఈ మధ్యకాలంలో వచ్చిన ఫన్ ఓరియెంటెడ్ సినిమాలు సూపర్ సక్సెస్ సాధించాయి. F2, జాతి రత్నాలు, F3 లాంటి సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే గాక ఆడియన్స్ కి కావాల్సినంత వినోదం పంచాయి. నేటితరం ఆడియన్స్ కూడా ఇలాంటి ఫన్ కాన్సెప్ట్ సినిమాలకు బాగా కనెక్ట్ అవుతున్నారు. థియేటర్స్ లో కామెడీ ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ కావడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాంటి తెలుగు ప్రేక్షకుల కోసం ”ఆవారా జిందగి” రూపంలో మరో ఫన్ ఫిల్డ్ ఎంటర్ టైనర్ రాబోతోంది.బిగ్ బాస్ శ్రీహాన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ ఆవారా జిందగి సినిమాను ఆడియన్స్ కోరుకునే విధంగా కామెడీ ప్రధానాంశంగా తెరకెక్కించారు. నలుగురు కుర్రోళ్ళ నడుమ నడిచే ఫుల్ లెంగ్త్ కామెడీతో ఈ సినిమాను గ్రాండ్ గా రూపొందిస్తున్నారు. జీరో లాజిక్ 100% ఫన్ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా రానుండటం ఆసక్తికర అంశం. అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించేలా ఈ సినిమా కథ ఎంచుకొని ఇంట్రెస్టింగ్ లొకేషన్స్ లో తెరకెక్కించారు మేకర్స్. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

విభా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దేప శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో ఈ ఆవారా జిందగీ రూపొందుతోంది. ఈ చిత్రానికి నంద్యాల మధుసూదన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. ఖర్చుకు ఎక్కడా వెనక్కి తగ్గకుండా సినిమా హై క్వాలిటీ నిర్మాణానికి ప్రియార్టీ ఇచ్చారు. కంభంపాటి విజయ్ కుమార్ సహ నిర్మాతగా వ్యవహరించగా.. ప్రతీక్ నాగ్ సంగీతం అందించారు.బిగ్ బాస్ శ్రీహాన్, ముక్కు అజయ్, ఢీ చెర్రీ, జస్వంత్, షియాజీ షిండే, సద్దాం, టార్జాన్ ప్రధాన పాత్రల్లో ఆధ్యంతం కామెడీ యాంగిల్ లో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా శ్యామ్ ప్రసాద్ V, ఉరుకుంద రెడ్డి S పని చేయగా.. S B రాజు తలారి ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. మంచి అవుట్‌పుట్ తో రాబోతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ అతిత్వరలో ప్రకటించనున్నారు మేకర్స్.

నటీనటులు
బిగ్ బాస్ శ్రీహాన్, ముక్కు అజయ్, ఢీ చెర్రీ, జస్వంత్, షియాజీ షిండే, సద్దాం, టార్జాన్ తదితరులు

టెక్నీషియన్స్
బ్యానర్: విభా ఎంటర్‌టైన్‌మెంట్స్
దర్శకత్వం: దేప శ్రీకాంత్ రెడ్డి
నిర్మాత: నంద్యాల మధుసూదన్ రెడ్డి
కో- ప్రొడ్యూసర్: కంభంపాటి విజయ్ కుమార్
మ్యూజిక్: ప్రతీక్ నాగ్
సినిమాటోగ్రాఫర్: శ్యామ్ ప్రసాద్ V, ఉరుకుంద రెడ్డి S
ఎడిటర్: S B రాజు తలారి

Latest News

ఇంకా “గగన” విహారంచేస్తున్నట్లుగానే ఉంది!!

"డాకు మహారాజ్"లో పోషించినపాయల్ పాత్రకు దండిగా ప్రశంసలుఅందుకుంటున్న చైల్డ్ ఆర్టిస్ట్ గగన గీతిక "డాకు మహారాజ్ లో నటించే అవకాశం రావడమే ఒక గొప్ప అవకాశం అనుకుంటే…...

More News