Ramarao On Duty Teaser | Ravi Teja, Divyansha , Rajisha | Sarath Mandava | Sudhakar Cherukuri

Presenting you the Teaser of Ramarao on Duty Movie written and directed by Sarath Mandava. Produced by Sri Lakshmi Venkateswara Cinemas and RT Team Works, Starring Ravi Teja, Divyansha Kaushik and Rajisha Vijayan.

‘డబుల్ ఇస్మార్ట్’ ఆడియన్స్ ని చాలా ఎంటర్ టైన్ చేస్తుంది ‘సంజయ్ ద’

Must Read

-డబుల్ ఇస్మార్ట్ లో సంజయ్ దత్ గారి బిగ్ బుల్ క్యారెక్టర్ హైలెట్. డబుల్ ఇస్మార్ట్ మెంటల్ మాస్ మ్యాడ్ నెస్ ని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు: ఉస్తాద్ రామ్ పోతినేని

-బిగ్ సెలబ్రేషన్స్ బిగిన్స్- ఉస్తాద్ రామ్ పోతినేని, సంజయ్ దత్, పూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్, పూరీ కనెక్ట్స్ డబుల్ ఇస్మార్ట్ నుంచి బిగ్ బుల్ సాంగ్ లాంచ్ 

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, ఉస్తాద్ రామ్ పోతినేని హైలీ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’ థియేట్రికల్ రిలీజ్ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్ తో నేషనల్ వైడ్ గా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తున్న ఈ మూవీ ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ మూవీ పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. కావ్య థాపర్ హీరోయిన్.

ఈరోజు బిగ్ బుల్ అనే స్పెషల్ సాంగ్ లాంచ్ చేశారు మేకర్స్. పూరి జగన్నాధ్ తన విలన్‌లను పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ ని ప్రెజెంట్ చేయడంలోస్పెషలిస్ట్. ఇప్పుడు ఆయన డబుల్ ఇస్మార్ట్‌లో మెయిన్ విలన్‌పై ఒక పాటను ఇంక్లూడ్ చేశారు. బిగ్ బుల్ క్యారెక్టర్ ని సంజయ్ దత్ పోషించారు.

మణి శర్మ కంపోజ్ చేసిన “బిగ్ బుల్” విజువల్, మ్యూజికల్ గా పవర్ ఫుల్ నెంబర్. హై ఎనర్జీ, పండుగ వాతావరణంలో సెట్ చేయబడిన ఈ పాట, కావ్య థాపర్ గ్లామర్ టచ్ యాడ్ చేసింది, సినిమాలోని కీలక పాత్రలను ఒకచోట చేర్చింది. వారి పెర్ఫార్మెన్స్ డ్యాన్స్ ఫ్లోర్‌ను ఆదరగొడుతోంది. భాస్కరభట్ల రవి కుమార్ సాహిత్యం బిగ్ బుల్ పాత్ర ఎసెన్స్ ని ప్రజెంట్ చేస్తోంది. పృధ్వీ చం,సంజన కల్మంజే వోకల్స్ ట్రాక్‌కి మరింత ఎనర్జీని ఇచ్చాయి.  

డబుల్ ఇస్మార్ట్‌ను పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్ మరియు ఛార్మి కౌర్ నిర్మించారు. సామ్ కె నాయుడు, జియాని జియానెలీ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. 

ముంబైలో గ్రాండ్ గా జరిగిన బిగ్ బుల్ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌ మాట్లాడుతూ.. అందరికీ నమస్తే. తెలుగు సినిమా డైనమిక్స్ ని మార్చిన డైరెక్టర్ పూరి జగన్నాధ్. ఈ సినిమాలో నన్ను పార్ట్ చేసి, బిగ్ బుల్ గా ప్రజెంట్ చేస్తున్న పూరి సర్ కి థాంక్ యూ. ఛార్మి పరేషాన్ చేసింది(నవ్వుతూ) తన హార్డ్ వర్క్, డెడికేషన్, ఫోకస్ వలనే ప్రోడక్ట్ అంత అద్భుతంగా వచ్చింది. కావ్య ఇందులో చాలా బ్యూటీఫుల్ గా కనిపించింది. విషు కి థాంక్ యూ. రామ్ నా యంగర్ బ్రదర్ లాంటి వాడు. తనకు పని చేయడం చాలా మజా వచ్చింది. డబుల్ ఇస్మార్ట్ గా మస్త్ ఉంటాడు. తనతో వర్క్ చేయడం ప్లెజర్ అండ్ హానర్. తను గుడ్ పెర్ఫార్మర్. వెరీ హార్డ్ వర్కర్. తన ఫన్ తో ఈ సినిమా చేశాం. చాలా చోట్ల తిరిగాం. చాలా మస్తీ చేశాం. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. సినిమాని చాలా ఎంజాయ్ చేస్తారు. అందరికీ థాంక్ యూ’ అన్నారు.    

ఉస్తాద్ రామ్ పోతినేని మాట్లాడుతూ.. నార్త్ ఆడియన్స్ సౌత్ ఫిలిమ్స్ ని ఇష్టంగా చూస్తారు. నేరుగా హిందీలో రిలీజ్ చేయమని కోరుతుంటారు. డబుల్ ఇస్మార్ట్ తో నార్త్ ఆడియన్స్ ముందుకు రావడం ఆనందంగా వుంది. సినిమాని దాదాపు ముంబైలో షూట్ చేశాం. డబుల్ ఇస్మార్ట్ మ్యాడ్నెస్ ఇక్కడ కూడా విట్నెస్ చేస్తారని ఆశిస్తున్నాను. డబుల్ ఇస్మార్ట్ మెంటల్ మాస్ మ్యాడ్ నెస్ క్యారెక్టర్. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. పూరి గారి నా కోసం ఈ క్యారెక్టర్ రాయడం ఆనందంగా వుంది. ఈ క్యారెక్టర్ ని చాలా ఎంజాయ్ చేస్తూ ప్లే చేశాను. ఇస్మార్ట్ శంకర్ ని ఆడియన్స్ హ్యుజ్ హిట్ చేశారు. ఇప్పుడు డబుల్ ఎనర్జీ, డబుల్ మాస్, ఎంటర్ టైన్మెంట్ తో వస్తున్నాం. సంజయ్ దత్‌ గారు ఇందులో హైలెట్. ఈ క్యారెక్టర్ ని ఆయన తప్పితే మరొకరు చేయలేరు. ఆయన స్వీట్ హార్ట్. ఆయనతో వర్క్ చేయడం హానర్. పూరి గారు హీరోలకు కూల్ యాటిట్యూడ్, స్వాగ్ యాడ్ చేశారు. తను కంప్లీట్ ట్రెండ్ సెట్టర్. ఆయనతో వర్క్ చేయడం ఆల్వేస్ హానర్. థాంక్ యూ’ అన్నారు 

డైరెక్టర్ పూరి జగన్నాధ్ మాట్లాడుతూ…నేను సంజయ్ బాబాకి బిగ్ ఫ్యాన్ ని. ఆయనకి నాలుగు దశాబ్దాల అనుభవం వుంది. వెర్సటైల్ యాక్టర్. అన్ని రకాల పాత్రలు చేశారు. మేము కలసినప్పుడు ఆయన ఏడు సినిమాలకి సైన్ చేసి వున్నారు. డేట్స్ లేవని చాలా వర్రీ అయ్యాం. ఫైనల్ గా ఆయన డేట్స్ దొరికాయి. ఆయన డబుల్ ఇస్మార్ట్ చేయడం చాలా హ్యాపీగా వుంది. ఈ సినిమా చేసినందుకు ఆయనకి థాంక్ యూ’ అన్నారు. 

హీరోయిన్ కావ్య థాపర్ మాట్లాడుతూ.. సంజయ్ దత్ గారితో స్క్రీన్ చేసుకునే అవకాశం రావడం డ్రీం కం ట్రూ మూమెంట్. ఆయన స్క్రీన్ షేర్ చేసుకుకోవడం బ్లెసింగ్. రామ్ గారు బెస్ట్ కో స్టార్. తను చాలా కేరింగ్ చూసుకున్నారు. ఛార్మి గారికి హ్యట్సప్. ఆమె చాలా కేరింగ్ పర్సన్.పూరి జగన్నాథ్ గారి హీరోయిన్ కావడం నా అదృష్టం. ఈ సినిమా అవకాశం ఇచ్చిన ఆయనకి వెరీ థాంక్స్. డబుల్ పవర్ ప్యాక్ మాస్ మసాలా సినిమా ఇచ్చినందుకు థాంక్ యూ’ అన్నారు. 

నిర్మాత ఛార్మి కౌర్ మాట్లాడుతూ.. డబుల్ ఇస్మార్ట్ ని ముంబైలో ప్రమోట్ చేయడం చాలా అనందంగా వుంది. 2019లో ఇస్మార్ట్ శంకర్. మీ అందరి ప్రేమతో ఈ సినిమా సీక్వల్ డబుల్ ఇస్మార్ట్ ని ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. పూరి సర్ అద్భుతంగా తీశారు. నార్త్ ఇండియాలో డబుల్ ఇస్మార్ట్ హ్యుజ్ హిట్ అవుతుందనే నమ్మకం వుంది’ అన్నారు.  

పూరి కనెక్ట్స్ సీఈవో విష్ మాట్లాడుతూ.. హలో ముంబై.. అందరికీ థాంక్ యూ. డబుల్ ఇస్మార్ట్ సినిమా చూశాను. మాంచి బిర్యానీ తర్వాత డబుల్ డబుల్ కా మీట తిన్న ఫీలింగ్ ని డబుల్ ఇస్మార్ట్ ఇస్తుంది. టీం అందరికీ థాంక్ యూ. బాబా, రామ్ భయ్యా చాలా సపోర్ట్ చేశారు’అన్నారు. 

యాక్టర్ అలీ మాట్లాడుతూ.. సంజు బాబా ని చూసాక మా అమ్మగారు గుర్తుకు వచ్చారు. తను మదర్ ఇండియా సినిమా వందసార్లకిపై చూశారు. తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ సినిమాలని కలుపుకొని ఇప్పటివరకూ దాదాపు 1250 సినిమాల్లో నటించాను. పూరి గారితో కలసి బిగినింగ్ డేస్ నుంచి ప్రయాణం చేస్తున్నాను. ప్రతి సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఇస్తారు. ఈ సినిమాలో నా పాత్రని అమెజాన్ అడవుల నుంచి తీసుకొచ్చారు. ఇలా ఎందుకు తీసుకొచ్చారో 15న చెబుతాను’ అన్నారు. 

నటీనటులు: రామ్ పోతినేని, సంజయ్ దత్, కావ్య థాపర్, అలీ, గెటప్ శ్రీను తదితరులు.

సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: పూరి జగన్నాధ్

నిర్మాతలు: పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్

బ్యానర్: పూరి కనెక్ట్స్

వరల్డ్ వైడ్ రిలీజ్: ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ (నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి)

సీఈఓ: విషు రెడ్డి

సంగీతం: మణి శర్మ

సినిమాటోగ్రఫీ: సామ్ కె నాయుడు, జియాని జియాన్నెలి

స్టంట్ డైరెక్టర్: కేచ, రియల్ సతీష్

పీఆర్వో: వంశీ-శేఖర్

Latest News

Experium Would Be Jewel in Hyd Crown Megastar Chiranjeevi

Megastar Chiranjeevi opined that the Experium Eco Park would soon turn into a jewel in Hyderabad's crown. Earlier today,...

More News