నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి, షైన్ స్క్రీన్స్ ‘భగవంత్ కేసరి’ ఫస్ట్ సింగిల్- గణేష్ సాంగ్ ప్రోమో విడుదల
ప్రీ-గణేష్ చతుర్థి వేడుకలు ప్రారంభమయ్యాయి, ‘భగవంత్ కేసరి’ మేకర్స్ గణేష్ సాంగ్ పాట ప్రోమోను విడుదల చేశారు. మాస్ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, శ్రీలీల.. బాబాయ్, అమ్మాయిగా కనిపించారు.
అనిల్ రావిపూడి ప్రతి సినిమాలో ఒక యూనిక్ పాయింట్ ఉంటుంది. భగవంత్ కేసరిలో బాలకృష్ణ, శ్రీలీల బాబాయ్, అమ్మాయిగా కనిపించనున్నారు. వీరిద్దరి అనుబంధం గణేష్ సాంగ్ ప్రోమో ద్వారా రివిల్ అయ్యింది. బాలకృష్ణ, శ్రీలీల.. వారి మధ్య అందమైన కెమిస్ట్రీని చూడటం కన్నుల పండగలా వుంది.
ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు, మాస్, తీన్మార్ నంబర్‌తో మ్యూజిక్ ప్రమోషన్‌లు ప్రారంభమయ్యాయి. ఈ పాట సెప్టెంబర్ 1న విడుదల కానుంది.
షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. జాతీయ అవార్డు-విజేత అర్జున్ రాంపాల్ ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు.
ఈ చిత్రానికి సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించగా, ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. తమ్మి రాజు ఎడిటర్, రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్. యాక్షన్ పార్ట్‌కి వి వెంకట్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.
దసరా కానుకగా అక్టోబర్ 19న భగవంత్ కేసరి విడుదల కానుంది.
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, అర్జున్ రాంపాల్, కాజల్ అగర్వాల్, శ్రీలీల
సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
బ్యానర్: షైన్ స్క్రీన్స్
సంగీతం: ఎస్ థమన్
డీవోపీ: సి రామ్ ప్రసాద్
ఎడిటర్: తమ్మి రాజు
ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్
ఫైట్స్: వి వెంకట్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ కృష్ణ
పీఆర్వో: వంశీ-శేఖర్
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…