యాక్షన్-హల్క్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 12వ సినిమానిని లెజెండరీ కోడి రామకృష్ణ గారి 75వ జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. పరిశ్రమలోకి అడుగుపెట్టి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి #BSS12 ప్రతిష్టాత్మక చిత్రం. #BSS12 హై బడ్జెట్, అత్యుత్తమ సాంకేతిక విలువలతో మ్యాసీవ్ స్కేల్ లో రూపొందుతోంది. ఈ చిత్రానికి డెబ్యూటెంట్ లుధీర్ బైరెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, మూన్‌షైన్ పిక్చర్స్‌పై మహేష్ చందు నిర్మిస్తున్నారు. శివన్ రామకృష్ణ సమర్పిస్తున్న ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ మూవీ.
400 ఏళ్ల నాటి గుడి నేపధ్యంలో ఒకల్ట్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ను మునుపెన్నడూ చూడని అవతార్‌లో ప్రెజెంట్ చేస్తోంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో హీరో పురాతన ఆలయం ముందు నిలబడి ఉన్నాడు. గుడిపై సూర్యకిరణాలు పడడంతో పోస్టర్ మొత్తం డివైన్ వైబ్ కనిపించింది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తుపాకీ పట్టుకుని గుడిని చూస్తున్నారు. పోస్టర్ అదిరిపోయింది, గొప్ప ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.
లుధీర్ బైరెడ్డి అన్ని కమర్షియల్ అంశాలతో కూడిన ఇంట్రస్టింగ్, పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా రేపటి నుంచి రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది.
ఈ చిత్రానికి అత్యుత్తమ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. శివేంద్ర కెమెరామ్యాన్, లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్, శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్.
తారాగణం: బెల్లంకొండ సాయి శ్రీనివాస్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: లుధీర్ బైరెడ్డి
నిర్మాత: మహేష్ చందు
సహ నిర్మాత : సాయి శశాంక్
బ్యానర్: మూన్‌షైన్ పిక్చర్స్
సమర్పణ: శివన్ రామకృష్ణ
డీవోపీ: శివేంద్ర
సంగీతం: లియోన్ జేమ్స్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
ఆర్ట్: శ్రీనాగేంద్ర తంగాల
పబ్లిసిటీ డిజైనర్: అనంత్ కంచెర్ల
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: వాల్స్ అండ్ ట్రెండ్స్
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…
ఇరుముడి సినిమా కలెక్షన్స్ చూస్తుంటే అసలు నమ్మశక్యం కాని విధంగా ఉన్నాయి. సినిమా చరిత్రలో ఇలాంటి కలెక్షన్స్, ఇలాంటి జనసందోహం…