వైవిధ్యమైన కథలతో ఆకట్టుకునే కథానాయకుడు త్రిగుణ్ (అదిత్ అరుణ్) హీరోగా, హెబ్బాపటేల్, ఇషాచావ్లా, వర్షిణి హీరోయిన్స్‌గా స్వాతి సినిమాస్ పతాకంపై సురేష్ దత్తి నిర్మిస్తున్న చిత్రం ‘టర్నింగ్ పాయింట్’. ఈ చిత్రానికి కుహన్ నాయుడు దర్శకుడు. గురువారం ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సన్సేషనల్ మాస్ స్టార్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్, దర్శకుడు విజయ్ కనకమేడల విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘ ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్‌కు సస్సెన్స్‌తో పాటు మాస్ అంశాలను జోడించి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు, విజయ్ గారు విడుదల చేయడం ఎంతో సంతోషంగా వుంది. వాళ్లు అందించిన సప్టోర్ట్ మరువలేనిది.త్వరలోనే చిత్రం టీజర్‌ను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. తప్పకుండా టర్నింగ్ పాయింట్ చిత్రం మా టీమ్ అందరికి కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుందని ఆశిస్తున్నాను.
కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు మా చిత్రంలో అలరించే అంశాలు చాలా వున్నాయి’ అన్నారు. దర్శకుడు కుహన్ నాయుడు మాట్లాడుతూ ‘ మాస్ సన్సేషనల్ స్టార్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో పాటు విజయ్ కనకమేడల మా చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడం ఆనందంగా వుంది. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో త్రిగుణ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. చిత్రంలోని ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. సినిమాలో యాక్షన్ ఏపిసోడ్స్ కూడా అలరించే విధంగా వుంటాయి. మర్డర్ మిస్టరీకి సంబంధించిన సస్పెన్స్ ఎలిమెంట్స్ ఆడియన్స్ ఎంగేజ్ చేస్తాయి. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. త్వరలోనే టీజర్‌ను కూడా విడుదల చేస్తాం’ అన్నారు. త్రిగుణ్ (అదిత్ అరుణ్), హెబ్బా పటేల్, ఇషా చావ్లా, వర్షిణి, రాశి, చమ్మక్ చంద్ర, రంగస్థలం మహేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్: రామకృష్ణ, మల్లేష్, ఎడిటర్: నాగిరెడ్డి, సంగీతం: ఆర్.ఆర్.ధ్రువన్, కెమెరా: గరుడ వేగ అంజి, లైన్ ప్రొడ్యూసర్: కుమార్ కోట, కో-ప్రోడ్యూసర్స్: నందిపాటి ఉదయభాను, ఎం.ఫణి భూషణ్ కుమార్, జీఆర్ మీనాక్షి, ప్రొడక్షన్ డిజైనర్: అలిజాల పాండు, ప్రొడక్షన్ మేనేజర్: రవి ఓలేటి, నిర్మాత: సురేష్ దత్తి, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: కుహన్ నాయుడు.
రాజశ్యామల బ్యానర్‌పై తెరకెక్కుతున్న ప్రొడక్షన్ నెంబరు - 2 చిత్రం మహేంద్రగిరి వారాహి. ఈ చిత్ర గ్లిమ్స్ ను ఇటీవల…
Mahendragiri Vaarahi is the production number 2 film under Rajashyamala banner. Glimpses of this film…
ఆకాష్ మురళి, అదితి శంకర్(స్టార్ డైరెక్టర్ శంకర్ కుమార్తె) జంటగా ‘పంజా’ఫేం విష్ణు వర్ధన్ తెరకెక్కించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్…
-'సంక్రాంతికి వస్తున్నాం' సెన్సేషనల్ హిట్. డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్ పెట్టడం చాలా ఆనందంగా అనిపించింది: నిర్మాత దిల్ రాజు విక్టరీ…
As a continuation of the highly successful Dance Ikon Season 1, which captivated dance lovers,…
డ్యాన్స్ లవర్స్ ను మెస్మరైజ్ చేసిన డ్యాన్స్ ఐకాన్ సీజన్ 1కు కొనసాగింపుగా "డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్…