జీ స్టూడియోస్ సమర్పణలో వానరా సెల్యులాయిడ్, మారుతీ టీమ్ ప్రొడక్ట్ నిర్మిస్తున్న ‘బ్యూటీ’ టీజర్ విడుదల

వానరా సెల్యులాయిడ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఆడియెన్స్‌ను మెప్పించబోతోంది. మైథలాజికల్ థ్రిల్లర్ ‘త్రిబాణధారి బార్బారిక్‌’ సినిమాతో త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. లవ్, యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్‌ను అందించేందుకు మారుతి టీం ప్రొడక్ట్‌తో కలిసి బ్యూటీ చిత్రాన్ని నిర్మిస్తోంది. జీ స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గీతా సుబ్రమణ్యం, హలో వరల్డ్, భలే ఉన్నాడే ఫేమ్ వర్ధన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కేఆర్ బన్సాల్ నిర్మించిన ఈ చిత్రంలో అంకిత్ కొయ్య మరియు నీలఖి పాత్ర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు బి.ఎస్. రావు ఎగ్జిక్యూటివ్ నిర్మాత.

రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ అందరిలోనూ ఈ సినిమా పట్ల ఆసక్తిని పెంచింది. ఇక వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ‘బ్యూటీ’ టీజర్ మరింతగా ఆసక్తిని పెంచేసింది. బ్యూటీ టీజర్ ఎంతో బ్యూటీఫుల్‌గా, ఎంతో ప్లెజెంట్‌గా ఉంది. ఓ అందమైన ప్రేమ కథతో పాటు, మిడిల్ క్లాస్ ఎమోషన్స్‌ని కూడా చూపించబోతున్నారనిపిస్తోంది. ఈ టీజర్‌లో అంకిత్ కొయ్య, నీలఖి పాత్రలు.. తండ్రిగా నరేష్, తల్లిగా వాసుకి పాత్రల్ని కూడా చూపించారు.

టీజర్ చూస్తుంటే ఓ స్కూటీ చుట్టూనే ఈ కథ తిరిగేలా ఉంది. స్కూటీ వచ్చాకా? ఏం జరుగుతుంది? అసలు హీరోయిన్ స్కూటీని ఎందుకు అడుగుతోంది..? ఆ స్కూటీ వచ్చాక హీరోయిన్‌లో వచ్చే మార్పులు ఏంటి? ఈ ప్రేమ కథలో ఎలాంటి ట్విస్టులు వస్తాయి.. అనే ఆసక్తికరమైన ప్రశ్నలు తలెత్తేలా టీజర్‌ను బ్యూటీఫుల్‌గా కట్ చేశారు. ఇక టీజర్‌లో విజువల్స్, ఆర్ఆర్ ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తున్నాయి. ‘లైఫ్‌లో నిన్ను ఇంకేం అడగను’ అనే డైలాగ్‌కు సినిమాలో చాలానే ఇంపార్టెన్స్ ఉందనిపిస్తోంది.

శ్రీ సాయి కుమార్ విజువల్స్, విజయ్ బుల్గానిన్ ప్లజెంట్ మ్యూజిక్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానున్నాయి. ఎస్‌బి ఉద్ధవ్ ఎడిటర్‌గా, బేబీ సురేష్ భీమగాని ఆర్ట్ డైరెక్టర్‌గా ఈ చిత్రానికి పని చేశారు.

నటీనటులు : అంకిత్ కొయ్య, నీలఖి పాత్ర, నరేష్, వాసుకి, నంద గోపాల్, సోనియా చౌదరి, నితిన్ ప్రసన్న, మురళీ గౌడ్, ప్రసాద్ బెహరా తదితరులు

సాంకేతిక సిబ్బంది
రచయిత, దర్శకుడు: వర్ధన్
నిర్మాతలు : అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కేఆర్ బన్సాల్
బ్యానర్లు : వానరా సెల్యులాయిడ్, జీ స్టూడియోస్, మారుతీ టీమ్ ప్రొడక్ట్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : బి.ఎస్. రావు
DOP : శ్రీ సాయి కుమార్ దారా
సంగీతం : విజయ్ బుల్గానిన్
ఎడిటర్ : SB ఉద్ధవ్
ఆర్ట్ : బేబీ సురేష్ భీమగాని
PRO: సాయి సతీష్

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

3 days ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

3 days ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

3 days ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

3 days ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

3 days ago