సినీ జ‌ర్నీలో 31 వ‌సంతాల‌ను పూర్తి చేసుకున్న బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్‌

ఈ ఏడాది ప్రారంభంలో ప‌ఠాన్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్‌తో బాక్సాఫీస్ రికార్డుల‌ను కొల్ల‌గొట్టి త‌న స‌త్తా చాటారు బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్‌. సెప్టెంబ‌ర్ 7న మ‌రోసారి పాన్ ఇండియా లెవ‌ల్లో సంద‌డి చేయ‌టానికి ఆయ‌న సిద్ధ‌మ‌వుతున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే షారూక్ ఈ ఏడాదితో సినీ జ‌ర్నీతో 31 వ‌సంతాల‌ను పూర్తి చేసుకోవ‌టం విశేషం. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న అభిమానులు, ఫాలోవ‌ర్స్‌తో #AskSRK కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

  • క‌వ‌ల పిల్ల‌లకు పేర్లు..

ఓ మహిళా అభిమాని మాట్లాడుతూ ‘నేనిప్పుడు ప్రెగ్నెంట్‌గా ఉన్నాను, డాక్ట‌ర్ క‌వ‌ల పిల్ల‌ల‌ని చెప్పారు. వారికి ప‌ఠాన్‌, జ‌వాన్ అనే పేర్లు పెట్టాల‌నుకుంటున్నా’న‌ని అన్నారు. దానికి షారూక్ బదులిస్తూ ఇంకా మంచి పేర్లు పెట్టాలని సూచించారు.

  • అలా కుదరదు..

ఓ అభిమాని త‌న స్నేహితుడు కోసం జ‌వాన్‌లో పాత్ర‌ను ఇవ్వాల‌ని కోరారు. దానికి షారూక్ ఖాన్ స్పందిస్తూ.. ‘అలా చేయ‌టం కుద‌ర‌ని ప్రేమ‌తో మీ స్నేహితుడుకి అర్థ‌మ‌య్యేలా చెప్పండి’ అన్నారు.

  • థియేటర్‌లో ఎంజాయ్ చేయండి..

జ‌వాన్ సినిమాకు సంబంధించిన ఓ ప్ర‌శ్న‌కు షారూక్ ఖాన్ బ‌దులిస్తూ ‘లేదు బిడ్డా.. స్నేహితులతో కలిసి థియేటర్‌లో ఎంజాయ్ చేయాల్సిందే’ అన్నారు.

  • ‘జవాన్’ టీజర్..రెడీ

జవాన్ టీజర్ గురించి ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘టీజర్ సిద్ధమవుతుంది. అందరూ ఎంజాయ్ చేసేలా సిద్ధం చేసి చూపిస్తా’నని అన్నారు.

  • జీవితంలో ఉపయోగపడుతుంది

గ్రాడ్యుయేషన్ పూర్తయ్యిందని చెప్పిన కొందరి నెటిజన్స్‌కు షారూక్ సమాధానం ఇస్తూ..ఆల్ ది బెస్ట్.. జీవితంలో మీరు నేర్చుకుంది ఉపయోగపడుతుంది.. కొన్నిసార్లు అని సమాధానం ఇచ్చారు.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

13 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

13 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

13 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago