విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ చిత్రం రాబోతోన్న సంగతి తెలిసిందే. ప్రతీ సోమవారం కన్నప్ప నుంచి ఒక అప్డేట్ ఇస్తూ సినిమా మీద అంచనాలు పెంచేస్తూనే ఉన్నారు. సినిమాలోని కీలక పాత్రలకు సంబంధించిన పోస్టర్‌లను రిలీజ్ చేస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నారు. కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ సోమవారం నాడు స్పెషల్ కారెక్టర్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేస్తున్నారు.
కృష్ణాష్టమి సందర్భంగా మంచు విష్ణు తనయుడు అవ్రామ్ మంచు ఫస్ట్ లుక్ విడుదల కానుంది. ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న అవ్రామ్ ఈ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేస్తున్నాడు. మంచు వారి మూడు తరాలు ఇందులో కనిపించబోతున్నాయి. మోహన్ బాబు, విష్ణు మంచు, అవ్రామ్ మంచు కలయికతో ఈ చిత్రం స్పెషల్ కానుంది. అవ్రామ్ పాత్ర, సినిమాలో లుక్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే మరో 3 రోజులు ఆగాలి.
విష్ణు మంచు టైటిల్ రోల్‌లో కనిపించనున్న కన్నప్ప అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా రాబోతోంది. ఇటీవలె విడుదల చేసిన టీజర్‌కి అద్భుతమైన స్పందన రావడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి.
డిసెంబర్‌లో ఈ సినిమా పాన్ ఇండియా వైడ్‌గా విడుదల కానుంది.
విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాతగా ఎంఎం నాయుడు రచన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు…
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఒకరికి ఒకరు వంటి సూపర్‌హిట్ చిత్రాలతో తెలుగులో అందరికి సుపరిచితుడైన కథానాయకుడు శ్రీరామ్. ఈయన…
తమ సబ్ స్క్రైబర్స్ కు మంచి ఎంటర్ టైన్ మెంట్ అందిస్తామనే ప్రామిస్ ను నిలబెట్టుకుంటూ బ్యాక్ టు బ్యాక్…
శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతోన్న కొత్త…
ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు (ఎన్.టి.ఆర్) వ్యక్తిత్వ మరియు ప్రచార హక్కులను రక్షణ కల్పించేలా గౌరవనీయ ఢిల్లీ హైకోర్టు…
దీక్షిత్ శెట్టి, క్రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో ప్రేమ్ చంద్ కిలారు తెరకెక్కించిన చిత్రం ‘శబార’. విశ్రమ్ ఫిల్మ్ ఫ్రాటర్నిటీ…