కృష్ణాష్టమి సందర్భంగా ‘కన్నప్ప’ నుంచి అవ్రామ్ మంచు ఫస్ట్ లుక్

Must Read

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ చిత్రం రాబోతోన్న సంగతి తెలిసిందే. ప్రతీ సోమవారం కన్నప్ప నుంచి ఒక అప్డేట్ ఇస్తూ సినిమా మీద అంచనాలు పెంచేస్తూనే ఉన్నారు. సినిమాలోని కీలక పాత్రలకు సంబంధించిన పోస్టర్‌లను రిలీజ్ చేస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నారు. కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ సోమవారం నాడు స్పెషల్ కారెక్టర్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేస్తున్నారు.

కృష్ణాష్టమి సందర్భంగా మంచు విష్ణు తనయుడు అవ్రామ్ మంచు ఫస్ట్ లుక్ విడుదల కానుంది. ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న అవ్రామ్ ఈ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేస్తున్నాడు. మంచు వారి మూడు తరాలు ఇందులో కనిపించబోతున్నాయి. మోహన్ బాబు, విష్ణు మంచు, అవ్రామ్ మంచు కలయికతో ఈ చిత్రం స్పెషల్ కానుంది. అవ్రామ్ పాత్ర, సినిమాలో లుక్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే మరో 3 రోజులు ఆగాలి.

విష్ణు మంచు టైటిల్ రోల్‌లో కనిపించనున్న కన్నప్ప అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా రాబోతోంది. ఇటీవలె విడుదల చేసిన టీజర్‌కి అద్భుతమైన స్పందన రావడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి.
డిసెంబర్‌లో ఈ సినిమా పాన్‌ ఇండియా వైడ్‌గా విడుదల కానుంది.

Latest News

య‌ష్ ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’ రిలీజ్‌కు 100 రోజులు మాత్రమే..సరికొత్త పోస్టర్ రిలీజ్ చేసిన మేక‌ర్స్‌

కొత్త టెక్నిషియ‌న్స్‌ను అనౌన్స్ చేసిన టీమ్‌ ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’ రిలీజ్‌కు కౌంట్ డౌన్ మొద‌లైంది. మార్చి 19, 2026న సినిమా...

More News