లెజండరీ డైరెక్టర్ శంకర్ ప్రొడక్షన్స్ అయిన ఎస్ పిక్చర్స్ పతాకంపై రూపొందిన ప్రేమిస్తే, వైశాలి, షాపింగ్ మాల్ లాంటి చిత్రాలన్నీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అదే పంథాలో డైరెక్టర్ శంకర్ ప్రొడక్షన్ లో మొదటి సారి సస్పెన్స్ థ్రిల్లర్ గా బ్లడ్ అండ్ చాక్లెట్ చిత్రాన్ని నిర్మించారు. షాపింగ్ మాల్, ఏకవీర తదితర సెన్సిబుల్ చిత్రాలను రూపొందించి, జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకున్న వసంతబాలన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఖైదీ, మాస్టర్, విక్రమ్ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందిన అర్జున్ దాస్ హీరోగా, దుశారా విజయన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఆడియోను డైరెక్టర్ శంకర్ చేతుల మీదుగా విడుదల చేశారు.
జి.వి. ప్రకాశ్ కుమార్ అందించిన సంగీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఈ సందర్భంగా డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ ‘వసంతబాలన్ సెన్సిటివ్ సబ్జెక్ట్ లను డీల్ చేస్తు వుంటారు. ఈ సినిమా చూడగానే నాకు చాలా బాగా నచ్చింది.
ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది. వసంతబాలన్ సెన్సిటివ్ కథాంశాన్ని టచ్ చేస్తూ, ఒక వైపు లవ్ మరో వైపు. సస్పెన్స్ కు రెండింటికి సమ న్యాయం చేస్తూ అద్భుతంగా రూపొందించారు’ అని అన్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో జూలై 21న విడుదలకానుంది.
తెలుగులో ఎస్.ఆర్ డి.ఎస్ సంస్థ చిత్రాన్ని విడుదల చేయనుంది.. ప్రముఖ సంగీత దర్శకుడు జీ.వి. ప్రకాష్ నాలుగు అద్భుతమైన పాటలు అందించారు. ఆయన అందించిన నేపథ్య సంగీతం సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని దర్శకుడు వసంతబాలన్ చెప్పారు. ఇంకా ఈ చిత్రంలో వనితా విజయ్ కుమార్, అర్జున్ చిదంబరం, సురేష్ చక్రవర్తి తదితరులు నటించారు.
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…