విక్రమ్ ప్రభు, మహిమా నంబియార్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ అసురగురు. ఎ. రాజ్‌దీప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని JSB సతీష్ నిర్మించారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో ఆసక్తిని పెంచిన ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ విడుదల చేశారు.
ట్రైన్ హీస్ట్ సీక్వెన్స్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం కట్టిపడేసింది. ట్రైలర్ పవర్ ప్యాడ్ యాక్షన్ తో సీట్ ఎడ్జ్ థ్రిల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది. విక్రమ్ ప్రభు పెర్ఫార్మెన్స్ అద్భుతంగా వుంది. దర్శకుడు రాజ్‌దీప్ థ్రిలింగ్ ఎలిమెంట్స్ ట్రైలర్ తో ప్రజెంట్ చేశారు. కెమరా పనితనం, నేపధ్య సంగీతం టాప్ క్లాస్ లో వున్నాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి.
విక్రమ్ ప్రభు తన తొలి బ్లాక్ బస్టర్ తొలి చిత్రం ఇవాన్ వేరెమదిరి (సిటిజన్ పేరుతో తెలుగులోకి డబ్ అయ్యింది) నుండి తన కెరీర్‌లో ఎప్పుడూ యాక్షన్ థ్రిల్లర్‌లతో అలరిస్తుంటారు.
తమిళంలో తాజా హిట్ చిత్రం ఇరుగపాట్రు తో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసిన విక్రమ్ ప్రభు ఇప్పుడు అసురగురుతో థ్రిల్ పంచబోతున్నారు.
ఇందులో హీరోయిన్ మహిమా నంబియార్ పాత్ర స్ట్రీట్ స్మార్ట్ డిటెక్టివ్‌గా తీర్చిదిద్దారు.
ఈ చిత్రం రైలు హీస్ట్ సీక్వెన్స్‌తో ప్రారంభమౌతోంది. తమిళనాడులో కొన్నేళ్ల క్రితం జరిగిన నిజ జీవితంలో జరిగిన దోపిడీ నుంచి స్ఫూర్తితో ఈ కథని తీర్చిదిద్దారు. ఇందులో హీరో క్లెప్టోమేనియాతో ఇబ్బందిపడుతుంటారు. ఈ క్యారెక్టరైజేషన్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది.
యోగి బాబు, ఎలాంగో కుమారవేల్ , సుబ్బరాజు, అనుపమ కుమార్, నాగినీడు, సంపత్ రామ్ కీలక పాత్రలు పోహిస్తున్న ఈ చిత్రానికి గణేష్ రాఘవేంద్ర మ్యూజిక్ అందిస్తున్నారు. అన్బరివ్ యాక్షన్ సమకూరుస్తున్నారు. లారెన్స్ కిషోర్ ఎడిటర్.
మే3న ఆహా ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.
తారాగణం: విక్రమ్ ప్రభు, మహిమా నంబియార్ ,యోగి బాబు, ఎలాంగో కుమారవేల్ ,సుబ్బరాజు, అనుపమ కుమార్ , నాగినీడు, సంపత్ రామ్ , మనోబాల, రాజన్, శివకుమార్ (పసంగ శివ కుమార్)
టెక్నికల్ సిబ్బంది:
దర్శకత్వం – ఎ. రాజ్‌దీప్
నిర్మాత – JSB సతీష్
సంగీతం – గణేష్ రాఘవేంద్ర
ఎడిటింగ్ – లారెన్స్ కిషోర్
యాక్షన్ – అన్బరివ్
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…
ఇరుముడి సినిమా కలెక్షన్స్ చూస్తుంటే అసలు నమ్మశక్యం కాని విధంగా ఉన్నాయి. సినిమా చరిత్రలో ఇలాంటి కలెక్షన్స్, ఇలాంటి జనసందోహం…