అసురగురు ట్రైలర్ విడుదల- మే3న ఆహాలో సినిమా స్ట్రీమింగ్

విక్రమ్ ప్రభు, మహిమా నంబియార్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ అసురగురు. ఎ. రాజ్‌దీప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని JSB సతీష్ నిర్మించారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో ఆసక్తిని పెంచిన ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ విడుదల చేశారు.

ట్రైన్ హీస్ట్ సీక్వెన్స్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం కట్టిపడేసింది. ట్రైలర్ పవర్ ప్యాడ్ యాక్షన్ తో సీట్ ఎడ్జ్ థ్రిల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది. విక్రమ్ ప్రభు పెర్ఫార్మెన్స్ అద్భుతంగా వుంది. దర్శకుడు రాజ్‌దీప్ థ్రిలింగ్ ఎలిమెంట్స్ ట్రైలర్ తో ప్రజెంట్ చేశారు. కెమరా పనితనం, నేపధ్య సంగీతం టాప్ క్లాస్ లో వున్నాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి.

విక్రమ్ ప్రభు తన తొలి బ్లాక్ బస్టర్ తొలి చిత్రం ఇవాన్ వేరెమదిరి (సిటిజన్ పేరుతో తెలుగులోకి డబ్ అయ్యింది) నుండి తన కెరీర్‌లో ఎప్పుడూ యాక్షన్ థ్రిల్లర్‌లతో అలరిస్తుంటారు.

తమిళంలో తాజా హిట్ చిత్రం ఇరుగపాట్రు తో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసిన విక్రమ్ ప్రభు ఇప్పుడు అసురగురుతో థ్రిల్ పంచబోతున్నారు.

ఇందులో హీరోయిన్ మహిమా నంబియార్ పాత్ర స్ట్రీట్ స్మార్ట్ డిటెక్టివ్‌గా తీర్చిదిద్దారు.

ఈ చిత్రం రైలు హీస్ట్ సీక్వెన్స్‌తో ప్రారంభమౌతోంది. తమిళనాడులో కొన్నేళ్ల క్రితం జరిగిన నిజ జీవితంలో జరిగిన దోపిడీ నుంచి స్ఫూర్తితో ఈ కథని తీర్చిదిద్దారు. ఇందులో హీరో క్లెప్టోమేనియాతో ఇబ్బందిపడుతుంటారు. ఈ క్యారెక్టరైజేషన్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది.

యోగి బాబు, ఎలాంగో కుమారవేల్ , సుబ్బరాజు, అనుపమ కుమార్, నాగినీడు, సంపత్ రామ్ కీలక పాత్రలు పోహిస్తున్న ఈ చిత్రానికి గణేష్ రాఘవేంద్ర మ్యూజిక్ అందిస్తున్నారు. అన్బరివ్ యాక్షన్ సమకూరుస్తున్నారు. లారెన్స్ కిషోర్ ఎడిటర్.

మే3న ఆహా ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.

తారాగణం: విక్రమ్ ప్రభు, మహిమా నంబియార్ ,యోగి బాబు, ఎలాంగో కుమారవేల్ ,సుబ్బరాజు, అనుపమ కుమార్ , నాగినీడు, సంపత్ రామ్ , మనోబాల, రాజన్, శివకుమార్ (పసంగ శివ కుమార్)

టెక్నికల్ సిబ్బంది:
దర్శకత్వం – ఎ. రాజ్‌దీప్
నిర్మాత – JSB సతీష్
సంగీతం – గణేష్ రాఘవేంద్ర
ఎడిటింగ్ – లారెన్స్ కిషోర్
యాక్షన్ – అన్బరివ్

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago