క్రైమ్, సస్పెన్స్, త్రిల్లర్ చిత్రాలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలని చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ క్రమంలో 750 చిత్రాలకు పైగా నటించి మెప్పించి తనికెళ్ల భరణి ప్రస్తుతం ప్రధాన పాత్రలో ‘అసుర సంహారం’ అనే చిత్రాన్ని చేస్తున్నారు. ఈ మూవీని శ్రీ సాయి ప్రవర్తిక బోయళ్ళ సమర్పణలో శ్రీ సాయి తేజో సెల్యూలాయిడ్స్ బ్యానర్ మీద సాయి శ్రీమంత్, శబరిష్ బోయెళ్ళ నిర్మించనున్నారు. ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం ఇలా అన్నింటిని కిషోర్ శ్రీకృష్ణ హ్యాండిల్ చేయనున్నారు.
అసుర సంహారం సినిమాలో తనికెళ్ల భరణితో పాటుగా.. మిధున ప్రియ ప్రధాన పాత్రలో నటించనున్నారు. విలేజ్ క్రైమ్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో ఇతర తారాగణం గురించి, ఇతర వివరాల గురించి త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ మూవీలో తనికెళ్ల భరణి విలేజ్ డిటెక్టివ్‌గా ఓ విభిన్నమైన పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారు.
నటీనటులు : తనికెళ్ల భరణి, మిధున ప్రియ తదితరులు
సాంకేతిక బృందం
బ్యానర్ : శ్రీ సాయి తేజో సెల్యూలాయిడ్స్
నిర్మాత : సాయి శ్రీమంత్ శబరిష్ బోయెళ్ళ
ఎక్స్క్యూటివ్ ప్రొడ్యూసర్ : మిధున ప్రియ
కెమెరామెన్:బాలు ABCD
సంగీతం : కరీం అబ్దుల్
ఆర్ట్ : దశరథ్
పాటలు : S.ప్రవీణ్ కుమార్
ఫైట్స్ : భరత్ కాళహస్తి
ఎడిటర్ : నరేంద్ర కుమార్
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : కిషోర్ శ్రీకృష్ణ
అంతకుమించి చిత్రం పేం సతీష్ జై, డాక్టర్ మైత్రి షరణ్ ల కుమార్తె "నైరా" మొదటి పుట్టినరోజు వేడుకలు ఇటీవల…
యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్ నటిస్తున్న కొత్త సినిమా "భగవంతుడు". ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ…
విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాతగా ఎంఎం నాయుడు రచన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు…
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఒకరికి ఒకరు వంటి సూపర్‌హిట్ చిత్రాలతో తెలుగులో అందరికి సుపరిచితుడైన కథానాయకుడు శ్రీరామ్. ఈయన…
తమ సబ్ స్క్రైబర్స్ కు మంచి ఎంటర్ టైన్ మెంట్ అందిస్తామనే ప్రామిస్ ను నిలబెట్టుకుంటూ బ్యాక్ టు బ్యాక్…
శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతోన్న కొత్త…