యూనిక్ థ్రిల్లర్ ‘హిడింబ’లో తన అద్భుతమైన యాక్షన్-ప్యాక్డ్ నటనతో అందరినీ సర్ ప్రైజ్ చేసిన ట్యాలెంటెడ్ హీరో అశ్విన్ బాబు ఇప్పుడు మరో ఎక్సయిటింగ్ చిత్రానికి సిద్ధమవుతున్నారు. అశ్విన్ బాబు 8వ చిత్రం #AB8 మామిడాల ఎం ఆర్ కృష్ణ దర్సకత్వంలో ఈరోజు అనౌన్స్ చేశారు. షణ్ముఖ పిక్చర్స్‌పై ఆలూరి సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆలూరి హర్షవర్ధన్ చౌదరి సమర్పిస్తున్నారు.
అశ్విన్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి ‘వచ్చినవాడు గౌతం’ అనే టైటిల్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. మెడికో థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఆసక్తికరమైన టైటిల్ పోస్టర్ స్టెతస్కోప్ పట్టుకున్న హీరో చేతిని చూపిస్తుంది. అతని ముఖాన్నిచేయి కవర్ చేస్తోంది. చేతి నుండి రక్తం కారుతోంది.
కథనంలో ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉండే సినిమా కోసం అశ్విన్ బాబు ఫిజికల్ గా మేకోవర్ అయ్యారు. గౌర హరి సంగీతం అందిస్తుండగా, శ్యామ్ కె నాయుడు కెమెరా మెన్ గా పని చేస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్. రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తుండగా , అబ్బూరి రవి డైలాగ్స్ అందిస్తున్నారు.
ఈ సినిమాలో హీరోయిన్, ఇతర వివరాలు త్వరలో తెలియజేస్తారు.
తారాగణం: అశ్విన్ బాబు
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: మామిడాల ఎంఆర్ కృష్ణ
నిర్మాత: ఆలూరి సురేష్
బ్యానర్: షణ్ముఖ పిక్చర్స్
సమర్పణ: ఆలూరి హర్షవర్ధన్ చౌదరి
డీవోపీ: శ్యామ్ కె నాయుడు
సంగీతం: గౌర హరి
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
ఫైట్స్: రామ్ – లక్ష్మణ్
డైలాగ్స్: అబ్బూరి రవి
సాహిత్యం: భాస్కర భట్ల – శ్రీమణి
పబ్లిసిటీ: అనిల్ & భాను
పీఆర్వో: వంశీ – శేఖర్
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…