ఆర్యన్‌గౌరా, మిస్తీ చక్రవర్తి జంటగా నటించిన చిత్రం ‘ఓ సాథియా’. దివ్యభావన దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తన్వికా–జశ్వికా క్రియేషన్స్ పతాకంపై సుభాష్ కట్టా, చందన కట్టా నిర్మించారు. జూలై 7న ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీగా విడుదలైన ఈ సినిమాను చూసిన ప్రేక్షకులనుండి మంచి స్పందన లభిస్తుండటంతో లవ్‌లీ హిట్ అని మీడియాతో ముచ్చటించారు చిత్రయూనిట్.
దర్శకురాలు దివ్యభావన మాట్లాడుతూ– “మా ‘ఓ సాథియా’ సినిమాను చూసిన ఎంతోమంది నుండి వచ్చిన చక్కటి రెస్పాన్స్ చూసి చాలా ఆనందపడ్డాను. కానీ, చాలాచోట్ల, చాలా జిల్లాల్లో ఈ సినిమా థియేటర్లలో విడుదల కాలేదని డిప్రెషన్‌కి లోనయ్యాను” అన్నారు. నిర్మాత మాట్లాడుతూ– “సినిమాకు మంచి స్పందన వచ్చింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సినిమా గురించి గొప్పగా మాట్లాడుతుండటంతో ఈ సినిమా రెండోవారంలో థియేటర్లను పెంచుతున్నాము. అలాగే చిన్న సినిమాలను మీడియా ప్రోత్సాహించాలి” అన్నారు.
హీరో ఆర్యన్ మాట్లాడుతూ– ‘‘నైట్ జాబ్ చేసుకుంటూ పగలు యాక్టింగ్ చేసి సినిమా కోసం దాదాపు రెండేళ్లు కష్టపడ్డాను. సినిమాకి ఎటువంటి సంబంధంలేని ఇలాంటి నిర్మాతను ఒప్పించి ఇండస్ట్రీకి తీసుకువచ్చాను. నన్ను నమ్మి వచ్చిన నిర్మాతకు ఎలాగైనా న్యాయం చేయాలని సినిమా కోసం పోరాటం చేస్తున్నాను. నేనూ, మా సినిమా హీరోయిన్ మిస్తీ థియేటర్లకు వెళ్లి పబ్లిక్ టాక్‌ను, రెస్పాన్స్‌ను కళ్లారా చూశాము. వారి స్పందన చూసిన తర్వాత సినిమా రెండో వారం నుండి పెద్ద ఎత్తున సక్సెస్ సాధిస్తుందని నమ్ముతున్నాను. ఈ వారం మంచి థియేటర్లను సంపాదించి మీ ముందుకు వస్తున్నాం. మీడియా వారందరూ మా చిన్నసినిమాను బ్రతికించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు.
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…