డీమాంటీ కాలనీ 2 ఘన విజయాన్ని అందించిన ఆడియెన్స్ కు థ్యాంక్స్ – హీరో అరుల్ నిథి

హారర్ థ్రిల్లర్ “డీమాంటీ కాలనీ 2” సినిమాకు ఘన విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు హీరో అరుల్ నిథి. గత నెల 23న “డీమాంటీ కాలనీ 2” తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చింది. ఈ సినిమాను ఎన్ శ్రీనివాస రెడ్డి సమర్పణలో శ్రీ బాలాజీ ఫిలింస్ బ్యానర్ పై ప్రొడ్యూసర్స్ బి సురేష్ రెడ్డి, బి.మానస రెడ్డి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. “డీమాంటీ కాలనీ 2” బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించిన నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో సంతోషాన్ని వ్యక్తం చేశారు హీరో అరుల్ నిథి.

  • డీమాంటీ కాలనీ 2 సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చాలా సంతోషంగా ఉంది. తెలుగులో మా సినిమా స్కేల్ తో చూస్తే చాలా పెద్ద సక్సెస్ ప్రేక్షకులు ఇచ్చారు. ఇక తమిళంలో మా సినిమా వండర్స్ క్రియేట్ చేస్తోంది. మాతో పాటు విక్రమ్ గారి తంగలాన్ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.
  • డీమాంటీ కాలనీ 2 సినిమాను తెలుగు ఆడియెన్స్ దగ్గరకు ప్రొడ్యూసర్ సురేష్ రెడ్డి గారు బాగా తీసుకెళ్లారు. తెలుగులో మంచి ప్రమోషన్ చేశారు. మా కంటే ఎక్కువగా మా సినిమాను ఆయన బిలీవ్ చేశారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. ఆయన వల్లే తెలుగులో మా సినిమా ఇంత పెద్ద సక్సెస్ అందుకుంది. తెలుగులో సక్సెస్ సెలబ్రేషన్స్ చేసేందుకు సురేష్ రెడ్డి గారు మమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు. ఇక్కడ కొన్ని అనివార్యమైన పనులతో హైదరాబాద్ రాలేకపోయాం. త్వరలోనే హైదరాబాద్ వచ్చి సక్సెస్ మీట్ నిర్వహిస్తాం.
  • డిమాంటీ కాలనీ 2 పర్పెక్ట్ సీక్వెల్ అనే పేరు వస్తోంది. డీమాంటీ కాలనీ 2తో పాటు 3, 4 సినిమాలు రాబోతున్నాయి. ఈ ఫ్రాంచైజీలో డీమాంటీ కాలనీ 3 బిగ్ స్పాన్ మూవీ అవుతుంది. ఎన్నో ట్విస్టు లు టర్న్ లతో ఈ సినిమా ఉండబోతోంది. కొత్త కొత్త స్టోరీస్ , క్యారెక్టర్స్ డీమాంటీ కాలనీ 3లో యాడ్ అవుతాయి. డీమాంటీ కాలనీ 2 సక్సెస్ మాకు ఎంతో సంతృప్తినిచ్చింది. టెక్నికల్ గా సామ్ సీఎస్ మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది. రీ రికార్డింగ్ తర్వాత సినిమాలోని కంటెంట్ చాలా ఎఫెక్టివ్ గా మారింది. సామ్ కు థ్యాంక్స్ చెబుతున్నాం.
  • ఈ సినిమాలో నేను ద్విపాత్రాభినయం చేశాను. శ్రీని క్యారెక్టర్ డీమాంటీ కాలనీ 1లో ఉన్నదే కంటిన్యూ అయ్యింది. రఘు అనే క్యారెక్టర్ కొత్తగా యాడ్ చేశాం. రఘు క్యారెక్టర్ చాలా స్టైలిష్ గా ఉంటుంది. తనొక బిగ్ ఆర్కిటెక్చర్. కాబట్టి స్టైల్ గా ఉంటాడు. రిచ్ కిడ్ కాబట్టి కేర్ లెస్ గా బిహేవ్ చేస్తుంటాడు. శ్రీని క్యారెక్టర్ కు కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టర్ రఘు. ద్విపాత్రాభినయం చేయడం కష్టమే. గతంలో నేను డ్యూయర్ రోల్ చేశాను. బాగా నటించాననే పేరొచ్చింది. డీమాంటీ కాలనీ 2కు మా డైరెక్టర్ అజయ్ మంచి స్క్రిప్ట్ చేశాడు.
  • నా కెరీర్ లో ఎక్కువగా థ్రిల్లర్స్, సస్పెన్స్ మూవీ చేశాను. అలా కావాలని ప్లాన్ చేయలేదు. ఇక నుంచి వేరే జానర్ మూవీస్ చేయాలని అనుకుంటున్నాను. నా ప్రతిభకు రావాల్సినంత గుర్తింపు రాలేదనే ప్రశ్న చాలాసార్లు ఎదురైంది. అయితే డీమాంటీ కాలనీ ఫ్రాంచైజీ ద్వారా ఆ గుర్తింపు దక్కుతుందని భావిస్తున్నా. నా సోదరుడు ఉదయనిధి స్టాలిన్ నెల క్రితమే డీమాంటీ కాలనీ 2 చూశాడు. సినిమా బాగుందని, మేకింగ్ క్వాలిటీ ఆకట్టుకుందని చెప్పారు. సినిమా షూటింగ్ టైమ్ లో ఎలాంటి భయం కలగలేదు. జీవితంలో కూడా భయపడే పనులేవీ చేయను.
  • ఈ సినిమా పార్ట్ 1లో ఒక క్యారెక్టర్ చేశాను. పార్ట్ 2లో రెండు క్యారెక్టర్స్ చేశాను. పార్ట్ 3లో ఎన్ని క్యారెక్టర్స్ చేయిస్తారో డైరెక్టర్ అజయ్ గారు నిర్ణయం తీసుకోవాలి. డీమాంటీ కాలనీ 3 మరిన్ని సర్ ప్రైజ్ లతో మీ ముందుకు వస్తుందని మాత్రం నమ్మకంగా చెప్పగలను. తెలుగులో మూవీ ఆఫర్స్ ఇప్పటివరకు రాలేదు. నా క్యారెక్టర్ బాగుండి. కథ ఆకట్టుకుంటే తప్పకుండా తెలుగులో స్ట్రైట్ సినిమా చేస్తా. అన్నారు.
Tfja Team

Recent Posts

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

6 days ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

6 days ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

6 days ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

6 days ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

6 days ago

పాన్ ఇండియా సినిమాలు తీస్తున్న డైరెక్టర్లందరికీ ఇది ఒక పాఠం — ఇరుముడి చూసి నేర్చుకోవాల్సిన సమయం వచ్చింది!

ఇరుముడి సినిమా కలెక్షన్స్ చూస్తుంటే అసలు నమ్మశక్యం కాని విధంగా ఉన్నాయి. సినిమా చరిత్రలో ఇలాంటి కలెక్షన్స్, ఇలాంటి జనసందోహం…

1 week ago