టాలీవుడ్

‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ నుంచి సెకండ్ సింగిల్ “నీతో ఇలా” విడుదల

యంగ్ అండ్ డైనమిక్ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ “అప్పుడో ఇప్పుడో ఎప్పుడో” అంటూ ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వైవిధ్యభరితమైన చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న బ్లాక్ బస్టర్ దర్శకుడు సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. స్వామి రారా, కేశవ తర్వాత.. నిఖిల్, సుధీర్ వర్మల కలయికలో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ లక్ష్యంగా “అప్పుడో ఇప్పుడో ఎప్పుడో” రాబోతోంది.

రీసెంట్‌గా రిలీజ్ చేసిన టీజర్, ఫస్ట్ సింగిల్‌తో టీం అందరినీ ఆకట్టుకుంది. ఫస్ట్ సింగిల్ ‘హే తార’కు మంచి స్పందన రావడంతో మ్యూజికల్ ప్రమోషన్స్‌ కూడా ఊపందుకున్నాయి. ఇక ఇప్పుడు ఈ మూవీ సెకండ్ సింగిల్ ‘నీతో ఇలా’ అంటూ సాగే పాటని మంగళవారం నాడు రిలీజ్ చేశారు. ఈ మెలోడియస్ ట్రాక్‌లో నిఖిల్, దివ్యాంశ కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది.

టాప్ సింగర్ కార్తీక్ అందించిన బాణీ.. రాకేందు మౌళి సాహిత్యం.. కార్తీక్, నిత్యశ్రీ గాత్రం ఈ మెలోడీ గీతాన్ని మరింత ప్రత్యేకంగా, అద్భుతమైనదిగా చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. సీనియర్  నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించారు. యోగేష్ సుధాకర, సునీల్ షా, రాజా సుబ్రమణ్యం ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కన్నడ నటి రుక్మిణి వసంత్ ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అవుతోంది.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను బాపినీడు బి సమర్పిస్తున్నారు. సింగర్ కార్తీక్ పాటలు కంపోజ్ చేస్తుండగా, సన్నీ ఎంఆర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీని, నవీన్ నూలి ఎడిటింగ్‌ బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో నవంబర్ 8న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

3 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago