జర్నలిస్ట్ గా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఎస్.కె.ఎన్ ‘బేబీ‘ చిత్రంతో నిర్మాతగా ఎలాంటి విజయాన్ని సాధించాడో తెలిసిందే. ఇప్పుడు ఇదే బాటలో మరో ఫిల్మ్ జర్నలిస్ట్ శివమల్లాల.. నిర్మాతగా నూతన నిర్మాణ సంస్థ శివమ్ మీడియా ప్రారంభించారు. శివమ్ మీడియా నిర్మించే చిత్రంలో హమరేశ్, ప్రార్థన సందీప్ హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా.. ఈ సినిమాకి శివ మల్లాల స్వయంగా కథను సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి వాలీ మోహన్‌దాస్ దర్శకుడు.
శివమ్ మీడియా లోగో, బ్యానర్‌ను ప్రముఖ నటుడు అలీ నిర్మాత, దర్శకులు ప్రవీణా కడియాల, అనిల్ కడియాల ప్రారంభించారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ.. ‘శివ నా తమ్ముడు లాంటివాడు. గత 20 ఏళ్లుగా వ్యక్తిగతంగా నాకు ఎంతో సన్నిహితుడు. చిన్న స్థాయి నుండి కెరీర్‌ను ప్రారంభించి ఈ రోజున నిర్మాతగా తన బ్యానర్‌ను స్థాపించి ముందుకు వెళ్లటం ఆనందంగా ఉంది‘ అన్నారు.
శివమ్ మీడియా అధినేత శివ మల్లాల మాట్లాడుతూ.. ‘నాకు ఎప్పుడు సపోర్టు చేసే ముగ్గురు స్నేహితులు అలీ, అనిల్, ప్రవీణా. ఈ ముగ్గురు చేతుల మీదుగా నా బ్యానర్‌ని ప్రారంభించటం ఎంతో హ్యాపీ. నేను ఎంత కష్టపడతానో ఈ ముగ్గురికి బాగా తెలుసు. శివమ్ మీడియా బ్యానర్‌పై మంచి సినిమాలు చేస్తాను‘ అన్నారు.
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…