నవంబర్ 14వ తేది ‘లవ్ ఓటిపి’సినిమా విడుదల సందర్భంగా మరియు రాజీవ్ కనకాల జన్మదినాన్ని పురస్కరించుకుని స్పెషల్ ప్రీమియర్ షో ప్రదర్శించారు ‘లవ్ ఓటిపి’ టీమ్. సినిమా ప్రీమియర్ చూసిన తర్వాత సినిమా టీమ్‌లోని దర్శకుడు–హీరో అనీష్, తండ్రి పాత్ర పోషించిన రాజీవ్ కనకాల, హీరోయిన్లు జాన్విక, స్వరూపిణి కమెడియన్ నాట్యరంగ, సంగీత దర్శకుడు ఆనంద్ రాజావిక్రమ్ పాల్గొని అనేక విషయాలు మాట్లాడారు.
హీరో–దర్శకుడు అనీష్ మాట్లాడుతూ–‘‘ ఈ రోజు కోసం నేను 14 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. నా సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఫుల్‌గా ఎంజాయ్ చేశామని చెప్తుంటే ఇంతకంటే నాకు ఏమి అవసరం లేదనిపించింది. చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు. రాజీవ్ కనకాల మాట్లాడుతూ–‘‘ నేను ఇప్పుడే ఈ సినిమాను చూశాను. ఎంతో ఎంజాయ్ చేశాను. నాకు అనీష్ బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చాడు . నేను పెద్దగా ఎమోషనల్ అవ్వను. కానీ అనీష్ పడిన కష్టం చూసి నాకు ఏడుపొచ్చింది. డియర్ అనీష్ వెల్‌కమ్ టు తెలుగు సినిమా ఇండస్ట్రీ. నీలో అద్భుతమైన టాలెంట్ ఉంది. కన్నడలోను తెలుగులోను నువ్వు చాలా పెద్దవాడివి అవుతావు. అలాగే హీరోయిన్లను ఉద్ధేశించి ఈ ఇద్దరు హీరోయిన్లు మామూలుగా చేయలేదు. అద్భుతంగా వారివారి పాత్రల్లో జీవించారు’’ అన్నారు.
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…