బుర్జ్ ఖలీఫా వద్ద యానిమల్ గర్జన

రణబీర్ కపూర్ నటించిన ‘యానిమల్’ చిత్రం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్‌ ఖలీఫా వద్ద అద్భుతం సృష్టించింది. దుబాయ్ లోని ఐకానిక్ బుర్జ్ ఖలీఫా వద్ద జరిగిన లార్జ్ దెన్ లైఫ్, గ్రాండ్ ఈవెంట్ లో బుర్జ్‌ ఖలీఫా పై యానిమల్ స్పెషల్ కట్ ని ప్రదర్శించారు.

రణ్‌బీర్ కపూర్, బాబీ డియోల్‌తో పాటు నిర్మాత భూషణ్ కుమార్ వేదికపై సందడి చేశారు. ఈ అద్భుతాన్ని చూడటానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. సహా నిర్మాతలు శివ చనన, ప్రణయ్ రెడ్డి వంగా కూడా ఈ గ్రాండ్ ఈవెంట్‌ లో పాల్గొన్నారు.

ఇటీవలే ఈ చిత్రం మాన్‌హాటన్ ఐకానిక్ టైమ్స్ స్క్వేర్‌లో సందడి చేసింది. ఆక్కడి డిజిటల్ బిల్‌బోర్డ్‌లపై  ప్రదర్శించిన టీజర్ అందరీ ఆకట్టుకోవడంతో యానిమల్ గ్లోబల్ దృష్టిని ఆకర్షించింది.

తాజాగా బుర్జ్ ఖలీఫా ఈవెంట్ యానిమల్ గ్రాండియర్ కి ప్రతీకగా నిలుస్తూ..లార్జర్-దేన్-లైఫ్ నెరేటివ్ కి సరైన కాన్వాస్‌ను అందించి సినిమా కోసం మరింత ఎక్సయిటింగ్ గా ఎదురుచూసేలా చేసింది.

యానిమల్‌లో రణబీర్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భూషణ్ కుమార్, కృష్ణ కుమార్ టి-సిరీస్, మురాద్ ఖేతాని సినీ1 స్టూడియోస్ , ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ యానిమల్‌ చిత్రాన్ని నిర్మించాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ప్రేక్షకులకు గొప్ప థ్రిల్ రైడ్ ని అందించే ఈ క్రైమ్ డ్రామా డిసెంబర్ 1, 2023న  గ్రాండ్ గా విడుదల కానుంది.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

13 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

13 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

13 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago